Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పై క‌త్తి మ‌హేష్ ట్వీట్ వైర‌ల్!

By:  Tupaki Desk   |   16 March 2018 4:18 PM GMT
ప‌వ‌న్ పై క‌త్తి మ‌హేష్ ట్వీట్ వైర‌ల్!
X
గుంటూరులో జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ స‌భ త‌ర్వాత జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌భ తర్వాత ప‌వ‌న్ పై - ఏపీ రాజ‌కీయాల‌పై క‌త్తి మ‌హేష్ ప‌లు ట్వీట్ లు చేశారు. తాజాగా - ప‌వ‌న్ పై మ‌హేష్ మ‌రో ట్వీట్ చేశారు. నేడు పార్ల‌మెంటులో వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 120 మంది ఎంపీలు మద్దతునిచ్చారని....వారిలో ప‌వ‌న్ ఎంత మంది మద్దతు కూడగట్టార‌ని ప్ర‌శ్నించారు. నేడు పార్ల‌మెంటులో అవిశ్వాసం తీర్మానంపై వైసీసీ నోటీసులు ఇవ్వగా దానిపై సోమవారం చర్చిస్తామని లోక్‌ సభ స్పీకర్‌ చెప్పిన విషయం తెలిసిందే

కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వైసీపీ అవిశ్వాస తీర్మానంపై ప‌వ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడితే తాను ఎంపీల మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తాన‌ని ప‌వ‌న్ అన్నారు. ఆ వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తూ మ‌హేష్ తాజాగా ట్వీట్ చేశారు. అంతేకాకుండా - ప‌వ‌న్ స‌భ జ‌రిగిన త‌ర్వాత మ‌హేష్ ప‌వ‌న్ పై ప‌లు ట్వీట్ లు చేశారు. ఆ స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌స్తావించిన‌ సమస్యలు జరుగుతున్నప్పుడు ప‌వ‌న్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఇంకా బాగుండేదని మ‌హేష్ అభిప్రాయ‌ప‌డ్డారు. అన్ని స‌మ‌స్య‌ల‌ను లెక్క‌గ‌ట్టి ఒకే సారి అప్పజెప్పడం వ‌ల్ల‌ లాభం లేద‌ని, రాబోయే ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకున్న ప‌వ‌న్ కు ఇప్ప‌టికైనా ఒక లక్ష్యం ఏర్పడింద‌ని సెటైర్ వేశారు.

అంతేకాదు, ప్రత్యేకహోదా కోసం పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తే - తాను కూడా జాయిన్ అవుతాన‌ని చెప్పారు.

``వైసిపి+వామపక్షాలు+జనసేన = 2019 ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం`` అంటూ త‌న‌దైన శైలిలో ట్వీట్ చేశారు.