Begin typing your search above and press return to search.

మార్కెట్ ను ముంచెత్తుతున్న కత్రినా.. కరీనా.. సల్మాన్!

By:  Tupaki Desk   |   12 Jan 2022 5:32 AM GMT
మార్కెట్ ను ముంచెత్తుతున్న కత్రినా.. కరీనా.. సల్మాన్!
X
ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. గంజాయి.. డ్రగ్స్ వినియోగానికి చెక్ పెట్టే పరిస్థితి లేకుండా పోతోంది. ఒకటి తర్వాత ఒకటి చొప్పున డ్రగ్స్ ను సరఫరా చేసే ముఠాలను పట్టుకుంటున్నా.. అంతకుమించి అన్న రీతిలో కొత్త జట్లు తెర మీదకు వస్తున్నాయి. దీంతో.. ఇప్పటి వరకుఅనుసరిస్తున్న విధానానికి భిన్నంగా.. కొత్త మార్గంలో డ్రగ్స్ సరఫరా చేసే వారిని గుర్తించాలన్న యోచనలో తెలంగాణ పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు. పోలీసుల ప్లానింగ్ పోలీసులకు ఉంటే.. డ్రగ్స్ ను సరఫరా చేసే ముఠాలు అంతకు మించిన ప్లానింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా హైదరాబాద్ లో పట్టుబడిన డ్రగ్స రాకెట్ లో సంచలన నిజాలు వెలుగు చూశాయి. షాకింగ్ అంశం ఏమంటే.. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు స్కూల్ పిల్లల చేత డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే.. ముంబయిలో అమ్మే డ్రగ్స్ కు పెడుతున్న పేర్లు మరింత షాకింగ్ గా మారాయని తెలుస్తోంది.

తాజాగా అదుపులోకి తీసుకున్న డ్రగ్స్ వ్యాపారుల్ని విచారించిన పోలీసులకు కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర నటీనటులైన కత్రినా.. కరీనా.. సల్మాన్ పేరుతో డ్రగ్స్ ను కోడ్ లాంగ్వేజ్ లో సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. హైదరాబాద్ లో సప్లై చేసే డ్రగ్స్ కు సినిమా పేర్లను కోడ్ లాంగ్వేజ్ గా పెట్టుకొని సరఫరా చేస్తున్న విషయం తాజాగా బయటకు వచ్చింది. అంతేకాదు.. ఆర్టీఎక్స్.. ఎండీ.. మాల్ పేర్లతోనూ హైదరాబాద్ లో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

గోవా.. ముంబయి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న డ్రగ్స్ ను హైదరాబాద్ వ్యాపారులు ఐదు రెట్ల ఎక్కువ లాభానికి అమ్మకాలు సాగిస్తున్నట్లుగా గుర్తించారు. అంతేకాదు.. హైదరాబాద్ డ్రగ్స్.. గంజాయి వ్యాపారంలో కీలకమైన ఐదుగురు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మొత్తం రాకెట్ కు సూత్రధారులు వీరేనని చెబుతున్నారు. వీరిని కానీ పట్టుకోగలిగితే.. డ్రగ్స్ నెట్ వర్కును బ్రేక్ చేసే అవకాశం వస్తుందని చెబుతున్నారు.యూత్ ను మత్తులో పడేసి.. వారిని మాయా లోకాలకు తీసుకెళుతున్న కత్రినా.. కరీనా.. సల్మాన్ డ్రగ్స్ కు త్వరగా చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.