Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ట్వీట్‌ కు క‌త్తి దూసేశాడోచ్‌!

By:  Tupaki Desk   |   6 Jan 2018 7:51 AM GMT
ప‌వ‌న్ ట్వీట్‌ కు క‌త్తి దూసేశాడోచ్‌!
X
మామూలుగానే క‌త్తి. ప‌వ‌న్ మాట్లాడ‌కున్నా.. ఆయ‌న పేరుతో దారిన పోయే దాన‌య్య మొద‌లు ప‌వ‌న్ ఫ్యాన్ అంటూ ట్యాగ్ పెట్టుకున్నోడు సైతం ఏమ‌న్నా దాన్ని ప‌వ‌న్ కు అంట‌గ‌ట్టే చిత్ర‌మైన మ‌న‌స్తత్వం నిండైన మ‌హేశ్ క‌త్తిది. త‌న మీద ఈగ కాదు క‌దా.. ఈగ రెక్క కిలోమీట‌ర్ దూరం నుంచి వ‌చ్చినా క‌త్తి ప‌ట్టుకొని క‌స‌.. క‌సామంటూ ట్వీట్లు మీద ట్వీట్లు చేసేయ‌టం మ‌హేశ్‌కు అల‌వాటు.

తాను మాట ప‌డ‌టం అన్న‌ది ఓకే అయినా.. అలాంటి ప‌రిస్థితే ఎవ‌రికైనా ఉంటుంద‌ని అస్స‌లు ఒప్పుకోడు. ప‌వ‌న్ లోని లోపాన్ని నిత్యం భూత‌ద్దం వేసుకొని వెతికి.. ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లోనూ.. టీవీ లైవ్ షోల‌లో క‌నిపిస్తుంటూ వివాదాన్ని స‌జీవంగా ఉంచే ప్ర‌య‌త్నం క‌నిపిస్తుంది.

నిత్యం అదే ప‌నిగా త‌న మీద వెల్లువెత్తుతున్న క‌త్తి ట్వీట్ల‌కు ప‌వ‌న్ కించిత్ క‌దిలాడో ఏమో కానీ.. ఈ రోజు పొద్దున్నే ఒక సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ త‌న‌కు పంపిన మెసేజ్ ప‌వ‌న్ ను క‌దిలించేసిన‌ట్లుంది. వ్య‌క్తిత్వంలో నిన్ను ఓడించ‌టం చేత‌కాని వాళ్లు.. నీ కులం.. ధ‌నం.. వ‌ర్ణం గురించి మాట్లాడ‌తారంటూ పంపిన మెసేజ్ ను ట్వీట్ చేశారు.

చూడు.. ఆ ట్వీట్ న‌న్ను ఉద్దేశించే అయి ఉంటుందంటూ వెంట‌నే రియాక్ట్ అయిపోయారు క‌త్తి మ‌హేశ్‌. నిజ‌మే మ‌రి.. ప‌వ‌న్ ఏం చేసినా మ‌హేశ్ క‌త్తి.. రాంగోపాల్ వ‌ర్మ‌ను దృష్టిలో పెట్టుకునే చేస్తాడు. ఎందుకంటే.. ప‌వ‌న్ ప‌రిధి వారిద్ద‌రే క‌దా. అందుకే.. తాను చేస్తున్న వ‌రుస వ్యాఖ్య‌ల‌పై రియాక్ట్ అయిన ప‌వ‌న్ తాజా ట్వీట్ చేశాడ‌ని ఫీల్ అయిన క‌త్తి వెంట‌నే త‌న‌దైన స్టైల్లో ఘాటు ట్వీట్ చేసేశారు.

‘ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్ - ఫ్రెండ్స్ - గర్ల్ ఫ్రెండ్. నేను కాదు. కాబట్టి పెట్టె గడ్డేదో వాళ్ళకి పెట్టు. ఇక వ్యక్తిత్వం గురించి అంటావా...అది నువ్వు మాట్లాడకపోతేనే బెటర్! అనవసరంగా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. జాగ్రత్త!’ అంటూ బ‌దులిచ్చేశాడు. మ‌రి.. ఇంత ఘాటుగా ఉంటేనే క‌దా ప‌వ‌న్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యేది. ఆ హ‌డావుడిలో ఎవ‌డో ఒక‌రు ఏదో ఒక‌టి అంటాడు.. దానికి మ‌ళ్లీ క‌త్తి దూయొచ్చు. సంచ‌ల‌నాల కోసం రెఢీ ఉండే టీవీ ఛాన‌ల్స్ కు అట్టే శ్ర‌మ‌ప‌డ‌కుండా టాపిక్‌.. దాంతోనే క‌త్తి మ‌హేశ్ దొరికేస్తారు క‌దా. ఇలా.. ఈ ఎపిసోడ్ కొన‌సాగుతూనే ఉంటుంది.