Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో పవన్ భారీ బంగ్లా కొన్నాడా?

By:  Tupaki Desk   |   20 Aug 2019 5:06 AM GMT
హైదరాబాద్ లో పవన్ భారీ బంగ్లా కొన్నాడా?
X
కొంతమంది మీద కొందరు చేసే విమర్శలకు.. ఆరోపణలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత లభిస్తుంటుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు.. సోషల్ మీడియాలో సినీ విమర్శకుడిగా ట్యాగ్ వేసుకున్న కత్తి మహేశ్ కు పొంతన లేదు. కానీ.. పవన్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేయటంలో కత్తి మహేశ్ తీరే వేరు. పవన్ ఫ్యాన్స్ కు తన మాటలతో ఇరిటేషన్ తెప్పించటమే కాదు.. వారికి కోపం నసాళానికి అంటేలా చేయటంలో ఆయన సిద్ధహస్తుడు. ఎన్నికలకు ముందు.. ఎన్నికల వేళలో పవన్ ను ఉద్దేశించి కత్తి మహేశ్ చేసిన విమర్శలు అన్ని ఇన్ని కావు.

గడిచిన కొద్దికాలంగా కామ్ గా ఉన్న కత్తి మహేశ్.. తాజాగా మరోసారి తనదైన శైలిలో పోస్ట్ పెట్టి వార్తల్లోకి వచ్చేశారు. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఆయనో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రీసెంట్ గా హైదరాబాద్ లో భారీ బంగ్లాను కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు.

తరచూ పేదరికం మాటలు చెప్పే పవన్.. తన కార్యాలయ సిబ్బందికి.. ఈఎంఐలకు డబ్బులు చెల్లించటానికి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లుగా చెబుతుంటారని.. అలాంటి ఆయన.. తాజాగా హైదరాబాద్ లో రూ.130 కోట్లతో ఒక భారీ భవనాన్ని కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు. డబ్బులు లేవనే పవన్ కు ఇంత భారీ బంగ్లాను ఎలా కొన్నారన్నది? కత్తి క్వశ్చన్. నిజంగానే పవన్ బంగ్లా కొన్నారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. కత్తి తాజా ఆరోపణపై పవన్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తానికి పవన్ ను కత్తి మహేశ్ వదిలేట్టు లేరుగా?