Begin typing your search above and press return to search.

పూనమ్ మీద కత్తి దూసిన మహేష్

By:  Tupaki Desk   |   6 Jan 2018 4:55 AM GMT
పూనమ్ మీద కత్తి దూసిన మహేష్
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ - ఫిలిం క్రిటిక్ కత్తి మహేశ్ మధ్య పోరు మరింత మంది వ్యక్తులకు విస్తరిస్తోంది. పవన్ కు మద్దతుగా కత్తిపై కొందరు నేరుగా విమర్శలు చేస్తుండగా ఆయన వారికి కూడా అంతే స్థాయిలో కౌంటర్లేస్తున్నారు. తాజాగా ఆయన టాలీవుడ్‌ నటి పూనమ్ కౌర్ పై మండిపడ్డారు. పవన్ కు నాలుగో భార్యగా ఉంటానని ప్రకటించిన పూనమ్ కౌర్ కు తనను విమర్శించే అర్హత లేదన్నారు.

ఇటీవ‌లే ర‌చ‌యిత కోన వెంక‌ట్ ప‌రోక్షంగా క‌త్తి మ‌హేశ్‌ ను ఉద్దేశించి ట్వీట్ చేసి విమ‌ర్శించ‌గా.. క‌త్తి మ‌హేశ్ కూడా ఆయ‌న‌కు దీటుగా స‌మాధానం ఇచ్చారు.తాజాగా హీరోయిన్ పూన‌మ్ కౌర్ కు కూడా మహేశ్ స్ట్రాంగ్ డోసిచ్చాడు. పూనమ్ రీసెంటుగా మ‌హేశ్ క‌త్తిపై విమ‌ర్శలు చేసింది.ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించాలనుకునే వారి కంటే అడుక్కునే వారు ఎంతో ఉత్త‌ములంటూ త‌న ట్విట్ట‌ర్‌ లో తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. 'ఆ ఫ్యాట్సోను రోజూ టీవీలో చూసి బోర్ కొడుతోంది. పాపం.. నిరుద్యోగ స‌మ‌స్య‌... ఎవ‌రో అనారోగ్యంతో బాధ‌పడుతున్నారు. ఆయ‌న‌కు డ‌బ్బులు డొనేట్ చేయండి. మ‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న వారికి కూడా మ‌నం ఆహారం అందిస్తున్నాం. ఇది చాలా గొప్ప విష‌యం. అత‌నికి మంచి పని దొర‌కాల‌ని కోరుకుంటున్నాను' అని మ‌హేశ్ క‌త్తిని ఉద్దేశిస్తూ ఆమె వ‌రుస‌గా ట్వీట్లు చేసింది.

దీంతో కత్తి మహేశ్ కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా పూనమ్ చరిత్ర అంతా తవ్వి తీశాడు. స‌ద‌రు హీరోయిన్ త‌న‌ను ఫ్యాట్సో అంటూ మాట్లాడ‌డంతోనే ఆమె సంస్కారం ఏంటో తెలిసిపోతోంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో మహేశ్ విమ‌ర్శించారు. పవన్ క‌ల్యాణ్ చేసిన సాయంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ చేనేత బ్రాండ్‌ అంబాసిడర్ గా ఆమె ఎంపికైంద‌ని అన్నారు. ప‌వ‌న్‌ మెప్పు కోసం తనపై ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తోంద‌ని తెలిపారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ల్ల ఆమెకు ఉద్యోగం వ‌చ్చింద‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆమెకు బ‌తుకుదెరువు చూపించినందుకు ఆమె త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని అన్నారు.'ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కి నాలుగో భార్య అవ్వ‌డానికి రెడీ అని ఆమె గతంలో చెప్పిందని క‌త్తి మ‌హేశ్ అన్నారు.