Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు కత్తి మహేష్ కౌంటర్

By:  Tupaki Desk   |   4 April 2021 11:30 AM GMT
పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు కత్తి మహేష్ కౌంటర్
X
‘పులివెందుల గుండాలకు ఎంత కాలం భయపడుతామని’ తిరుపతి సభలో పవన్ కళ్యాన్ చేసిన విమర్శలు పెను దుమారం రేపుతున్నాయి. దీనిపై వైసీపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.

పులివెందుల పేరుతో ఎవరి మీద దౌర్జన్యాలు చేస్తారని పవన్ నిన్న ప్రశ్నించారు. పులివెందుల పేరు దుర్మార్గాలకు, దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని మండిపడ్డారు. అక్కడ మానవ హక్కులు కాలరాసిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ గుండాలకు భయపడే వ్యక్తిని తాను కాదంటూ విమర్శించారు. చొక్కాలు పట్టుకొని లాగుతానంటూ పవన్ హెచ్చరించారు. ఈ విమర్శలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఇక ఈ విమర్శలపై చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ దళిత నాయకుడు కత్తి మహేష్ కూడా తీవ్రంగా స్పందించారు. పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. ‘పులివెందుల అంటే పవన్ కళ్యాణ్ కు రౌడీలు, గుండాలు, ఫ్యాక్షనిస్టులు గుర్తొస్తే.. తనకు మాత్రం మహానటులు ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ లకు సినీ భిక్ష పెట్టిన బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి గుర్తుకు వస్తున్నారు’ అని కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ లాంటి మహానాయకుడికి కూడా పులివెందుల అంటే వాళ్లిద్దరే గుర్తుకు వస్తారని అన్నారు. అందుకే తెలుగుదేశం పేరుతో ఓ ప్రాంతీయపార్టీని నెలకొల్పిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కాగలిగాడని కత్తి మహేష్ చెప్పుకొచ్చాడు.