Begin typing your search above and press return to search.
పవన్ 100 కోట్ల ఇన్ కమ్ ఎలా సాధ్యం?
By: Tupaki Desk | 27 Nov 2018 5:19 AM GMTపవర్ స్టార్ గా స్టార్డమ్ ను పీక్స్ లో చూసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా జనసేన అధ్యక్షుడిగా ప్రజా జీవితంలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ రాబోయే ఎన్నికలకు జనసైనికులను సిద్ధం చేస్తున్నారు. మొదట్లో పవర్ తన గమ్యం కాదని చెప్పినా ఇప్పుడు మాత్రం ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం అవుతానని అంటున్నారు. ప్రజల కోసం రూ. 100 కోట్ల సంపాదనను త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చానని.. ఎవరికి వోట్ వేయాలన్న విషయం ప్రజలే నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు.
రూ.100 కోట్ల సంపాదన-త్యాగం అనే మాట పవన్ కళ్యాణ్ ఈమధ్య తరచుగా అనడంతో పవన్ విమర్శకులు ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు. పవన్ అంటే అంతెత్తున ఎగిరిపడే మహేష్ కత్తి ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. "అసలు నేని సంపాదనను అయన ఎలా త్యాగం చేస్తాడు? మార్కెట్ వ్యాల్యూ ప్రకారం పవన్ రెమ్యూనరేషన్ రూ.25 కోట్లు ఉంటుంది.. అఫీషియల్ గా అయితే రూ. 12 కోట్లే. ఈ లెక్కన రూ.100 కోట్లు సంపాదించాలంటే పవన్ ఏడాదికి నాలుగు సినిమాలు చేయాల్సి ఉంటుంది" అన్నాడు.
ఇంతటితో ఆగని కత్తి 2014 ఎలెక్షన్స్ సమయంలో పవన్ చేసిన హంగామాకు గానూ అయన సంపాదన రూ. 100 పైగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. సినిమాలకంటే ఎక్కువ సంపాదించేందుకు రాజకీయాలను ఎంచుకున్నారేమో అని మరో డౌట్ వ్యక్తం చేశాడు. కత్తి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.