Begin typing your search above and press return to search.

నాగబాబుకు కత్తి కౌంటర్..తలకు రోకలి చుట్టండ్రా..!

By:  Tupaki Desk   |   16 Dec 2019 1:11 PM GMT
నాగబాబుకు కత్తి కౌంటర్..తలకు రోకలి చుట్టండ్రా..!
X
ఈ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హిందూ మతం విషయంలో దూకుడుగా వెళుతున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని హిందూ మతంకు గట్టి మద్దతు తెలుపుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాం లో మాత మార్పిడులు ఎక్కువైపోయాయని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈయన కామెంట్లని విభేదిస్తూ...సొంత పార్టీ నేతలు సైతం పార్టీని వీడుతున్నారు. ఇక ఓ వైపు ఇంత జరుగుతున్న పవన్ సోదరుడు నాగబాబు మతం విషయం పై హాట్ కామెంట్లు చేశారు.

పవన్ కళ్యాణ్‌ చేస్తున్న మతపరమైన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ.. ట్విట్టర్‌ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘కేవలం హిందువులు ఇతర మతస్థుల నమ్మకాల్ని ఆచారాల్ని గౌరవించడం మాత్రమే పరమత సహనం అనిపించుకోదు. ఇతర మతస్థులు కూడా హిందు మతస్థుల నమ్మకాల్ని ఆచారాల్ని గౌరవించినప్పుడే నిజమైన పరమత సహనం అనిపించుకుంటుంది’ అంటూ పోస్ట్‌ చేశారు.

అలాగే మరో పోస్ట్‌లో.. ‘నిజానికి నేనొక నాస్తికుడిని. కానీ నేను హిందు మతాన్ని విపరీతంగా గౌరవిస్తాను. కారణం హిందు మతంలో నాస్తికుల అభిప్రాయాలకి కూడా చాలా గౌరవం ఉంది. అందుకే చార్వాకం. నిరీశ్వరవాదం కూడా ప్రసిద్ధి చెందాయి. వేరే మతాలలో అయితే ఎథిక్స్ ఫాలో అయ్యేవాళ్ళకి చావే తలరాత అయ్యుండేది’ అంటూ ట్వీట్ చేశారు.

ఇక నాగబాబు ట్వీట్లకు సినీ - రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.. ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... ‘పిచ్చి ముదిరింది... వీడి తలకి రోకలి చుట్టండ్రా!’ అంటూ నాగబాబుని ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. అయితే ఈ పోస్టుకు ‘మెల్లగా హిందూ కార్డ్ వాడకం మొదలు పెడుతున్నారు అంటే.. భాజపా చేరువకి టీజర్ అనుకోవచ్చా?’ అని కామెంట్ రాగా, దానిపై కత్తి మహేష్ పోస్ట్‌ పై స్పందిస్తూ... ‘మీకు ఇంకా సందేహమా.. వీళ్లవి అన్నీ అబద్దాలు మోసాలే’ అంటూ పెట్టారు