Begin typing your search above and press return to search.
యువరాణి టాప్ లెస్ ఫోటోలకు 1.45 కోట్ల ఫైన్
By: Tupaki Desk | 6 Sep 2017 7:58 AM GMTవెనుకా ముందు చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే మీడియా సంస్థలకు చెంపపాటి తీర్పుగా దీన్ని చెప్పాలి. విలువల్ని.. ప్రమాణాల్ని పక్కన పెట్టేసి సంచలనే ధ్యేయంగా వ్యవహరించే తీరుకు బ్రిటన్ కోర్టు ఒకటి చక్కటి తీర్పు ఇచ్చింది. బ్రిటన్ యువరాణి.. డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేట్ మిడిల్టన్ టాప్ లెస్ ఫోటోల్ని కవర్ పేజీ మీద పబ్లిష్ చేసిన ఒక మేగజైన్ భారీ మూల్యం చెల్లించక తప్పలేదు.
రాజకుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేసిన క్లోజర్ మేగజైన్ కు భారీ జరిమానాను విధించారు. 2012లో భర్త విలియమ్స్ తో కలిసి కేట్ ఫ్రాన్స్ కు వెళ్లారు. ఈ సందర్భంగా కేట్ అక్కడ ఒక స్విమ్మింగ్ ఫూల్ లో బికినీ బాటమ్ మాత్రమే ధరించి సేద తీరుతోంది.
ఈ దృశ్యాన్ని లాంగ్ లెన్స్ కెమేరా సాయంతో కొందరు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు. వీటిని క్లోజర్ అనే మేగజీన్ ప్రచురించింది. దీంతో తమ పరువుకు నష్టం వాటిల్లిందంటూ కేట్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు యువరాణి టాప్ లెస్ ఫోటోలు ప్రచురించిన క్లోజర్ కు రూ.76 లక్షల జరిమానాతో పాటు.. పత్రిక ఎడిటర్.. పబ్లిషర్లను చెరో రూ.34 లక్షలు చొప్పున జరిమానాను విధిస్తూ తీర్పు ఇచ్చింది. సంచలనాల కోసం అడ్డదారులు తొక్కే వారికి ఈ తీర్పు ఒక హెచ్చరికలా పని చేస్తుందని చెప్పక తప్పదు.