Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ ఎంట్రీపై కాస్తంత క్లారిటీ ఇచ్చేసింది

By:  Tupaki Desk   |   28 Jun 2017 8:32 AM GMT
ర‌జ‌నీ ఎంట్రీపై కాస్తంత క్లారిటీ ఇచ్చేసింది
X
న‌టి క‌స్తూరి గుర్తుందా? దాదాపు ప‌దిహేనేళ్ల‌కు పైగా ఇండ‌స్ట్రీలోనే ఉంటూ తెలుగు.. త‌మిళ‌.. క‌న్న‌డ‌.. మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించినప్పటికి తెలుగులో ఆమెకు ద‌క్కిన అవ‌కాశాలు అంతంత‌మాత్ర‌మే. తెలుగులో గ్యాంగ్ వార్ తో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. నిప్పుర‌వ్వ‌.. సోగ్గాడి పెళ్లాం.. అన్న‌మ‌య్య‌.. మా ఆయ‌న బంగారం.. ఆకాశ‌వీధిలో ఇలా చాలానే సినిమాలు చేసినా స‌రైన బ్రేక్ మాత్రం రాలేదు.

దీంతో.. తెలుగుకు త‌క్కువ‌గా త‌మిళ్ లో ఎక్కువ‌గా క‌నిపించిన ఈ భామ సౌత్ లోని అన్ని వుడ్‌ల‌లో త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకున్నారు. అయితే.. త‌మిళ్ లో త‌ప్ప పెద్ద‌గా వ‌ర్క్ వుట్ కాలేద‌నే చెప్పాలి. న‌టిగా ఆమె పేరుతో న్యూస్ త‌క్కువే అయినా.. తాజాగా ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ మీద అమ్మ‌డి మాట‌లు త‌లైవా ఫ్యాన్స్ కు కోపం తెప్పించేశాయి. అనంత‌రం ర‌జ‌నీని ఆమె క‌ల‌వ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ర‌జ‌నీ రాజ‌కీయ ఎంట్రీ మీద ఆమెను ప్ర‌శ్నించిన‌ప్పుడు మ‌ళ్లీ మ‌రోసారి మీడియా మీద ఫైర్ అయ్యింది. త‌మిళ‌నాడు రాష్ట్రం చాలానే స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంద‌ని.. అయిన‌ప్ప‌టికీ ఆ విష‌య‌లేవీ ప‌ట్టించుకోకుండా ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ మీద‌నే జాతీయ మీడియా ఫోక‌స్ చేయ‌టం ఏమిటంటూ మండిప‌డింది.

అమ్మ అనారోగ్యానికి గురైన నాటి నుంచి రాష్ట్రంలో శూన్య‌త ఆవ‌రించి ఉంద‌ని.. ఓ మంచి వ్య‌క్తి వ‌చ్చి శూన్య‌త‌ను భ‌ర్తీ చేయాల‌న్న అభిలాష‌ను ఆమె వ్య‌క్తం చేశారు. ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌స్తారా? రారా? అంటూ త‌ర‌చూ ఊహాగానాలు చేయ‌టం స‌రికాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

ఇన్ని మాట‌లు చెప్పిన ఆమె.. ప‌నిలో ప‌నిగా మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్యను చేయ‌టం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లో మార్పు దిశ‌గా ర‌జనీ అడుగులు వేసే అవ‌కాశం ఉంద‌ని ఆమె చెప్పారు. ర‌జ‌నీని ఇటీవ‌ల క‌లిసిన త‌ర్వాత ఆమె ఈ వ్యాఖ్య చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు ర‌జ‌నీతో తన మీటింగ్ గురించి చెబుతూ.. త‌లైవా రాజ‌కీయ అభిప్రాయాలు తెలుసుకునే వీలు తాజా భేటీ క‌ల్పించిందంటూ ఆమె వెల్ల‌డించారు. మొత్తానికి త‌లైవా పుణ్య‌మా అని క‌స్తూరి మీడియాలో త‌ర‌చూ క‌నిపిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/