Begin typing your search above and press return to search.
కశ్మీరీలు జాతి వ్యతిరేకులు కాదు.. మీలాంటి నేతలే బాస్
By: Tupaki Desk | 30 Oct 2020 9:10 AM GMTసున్నితమైన..కీలకమైన అంశాల వేళ.. కచ్ఛితత్త్వంలో ఏ చిన్న పొరపాటు దొర్లినా.. అవసరం లేని భరోసాను ప్రదర్శిస్తే.. దానికి చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. ఈ విషయంలో భారత్ కు ఉన్న అనుభవాలు అన్ని ఇన్ని కావు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అనుసరించిన విధానాలు.. తీసుకున్న నిర్ణయాలు జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఆరని మంటల్ని రేపటమే కాదు.. సుదీర్ఘకాలం పాటు ఆ నేత అశాంతితో తల్లడిల్లే పరిస్థితి. నిజాంస్టేట్ విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యవహరించిన తీరునే.. జమ్ముకశ్మీర్ విషయంలో నెహ్రు అనుసరించి ఉండి ఉంటే ఇవాల్టి రోజున పరిస్థితి మరోలా ఉండేది. మోడీ లాంటి నేత దేశ ప్రధాని అయి.. ఆర్టికల్ 370ను ఎత్తేసే అవసరమే ఉండేది కాదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రజల భావోద్వేగాల్ని అసరాగా చేసుకొని.. వారిలో లేనిపోని అనుమానాల్ని.. భయాల్ని నింపి రాజకీయ ప్రయోజనం పొందిన అబ్దుల్లా.. ముఫ్తీ కుటుంబాలు ఈ రోజుకువారి నోటి నుంచి వచ్చే మాటలు ఏ మాత్రం స్వాగతించేలా ఉండవు. జమ్ముకశ్మీర్ సమస్యకు పరిష్కారాన్ని వెతికిన కేంద్రం తీరును ఏ మాత్రం అంగీకరించని వారు.. తమ నోటికి పని చెప్పటమే కాదు.. దారుణ వ్యాఖ్యలకు తెగపడటం చూస్తున్నదే.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మాదిరి దేశ ప్రజలు జమ్ముకశ్మీర్లోని ఏ ప్రాంతంలోని భూముల్నిఅయినా కొనుగోలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దశాబ్దాల క్రితమే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. జమ్ముకశ్మీర్ ను కొందరు తమ గుప్పిట్లో ఉంచుకునే కన్నా.. దేశ వ్యాప్తంగా అందరికి అవకాశం కల్పిస్తే.. అక్కడి సమీకరణాల్లో భారీగా మార్పులు చోటు చేసుకోవటమేకాదు.. హిమగిరుల్లో ఆరని మంటలు చల్లారే అవకాశం ఉంది.
నిత్యం ఏదో ఒక అగ్గి రాజేయాలన్నట్లుగావ్యవహరించే కశ్మీరీ నేతలకు.. తాజాగా మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏ మాత్రం మింగుడుపడనిది. ఆర్టికల్ 370 ఎత్తి వేత తర్వాత ఏడాదిపాటు హౌస్ అరెస్టులో ఉన్నవారు.. ఈ మధ్యనే బయటకు రావటం.. వచ్చినంతనే తమ నోటికి పని చెప్పటం తెలిసిందే. ఆర్టికల్ 370నుమళ్లీ పునరుద్ధించే వరకు కశ్మీర్ లో భారతీయ జెండా ఎగరదన్న తీవ్రమైన వ్యాఖ్యల్ని చేసే వరకు వెళ్లారంటే వారి బరితెగింపు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
తాజాగా నేషనల్ కాన్ఫరెన్సు నేత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్ లో మాత్రమే కాదు.. హిమాచల్ ప్రదేశ్.. సిక్కిం.. మేఘాలయ.. నాగాలాండ్ తోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారతీయులు ఎవరూ భూములు కొనడానికి ఇప్పటికి వీల్లేదని.. చట్టాల గురించి మాట్లాడిన పక్షంలో తమనే జాతి వ్యతిరేకులుగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. ఒమర్ చెప్పినట్లుగా జమ్ముకశ్మీర్ ప్రజల్ని ఎవరు ఎప్పుడూ జాతి వ్యతిరేకలుగా చూడలేదు. ఆ మాటకు వస్తే.. కశ్మీరీల్లోని కొందరు అతివాదులు ఒమర్ లాంటి నేతల మాటలు విని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా సహనంతో ఊరుకున్నారే తప్పించి.. ఎదురుమాటలు అనలేదు. కశ్మీరీల్లోని కొందరిని తమ మాటలతో అదే పనిగా రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చుకునే నేతలే.. నిజమైన జాతి వ్యతిరేకులన్న విషయం ఒమర్ కు తెలియంది కాదు.