Begin typing your search above and press return to search.
అసాధ్యమేదీ లేదు: రోజువారీ కూలీగా పని చేస్తూ నీట్ కొట్టేశాడు
By: Tupaki Desk | 16 Jun 2023 10:59 AM GMTవావ్.. వండర్ ఫుల్.. అమేజింగ్.. లాంటి పదాలకు సరిగ్గా సూట్ అయ్యే కుర్రాడి ఉదంతమిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా కష్టమైన పనిని చెబితే.. సాధ్యం కాదని.. అంత తేలికైన విషయం కాదని.. ఎంత కష్టమో తెలుసా? అంటూ దీర్ఘాలు తీసే యూత్ దగ్గర నుంచి అన్ని వయస్కుల వారికి ఇతనో సజీవ స్ఫూర్తిగా చెప్పాలి. అత్యంత కష్టమైన.. క్లిష్టమైన ప్రవేశ పరీక్షల్లో జాతీయ మెడిసిన్ ఎంట్రన్స్ అయిన నీట్ గురించి చెబుతుంటారు. దీన్ని క్రాక్ చేయటం కోసం కిందా మీదా పడుతూ.. శ్రమిస్తూ.. ఆఖరకు అనుకున్నది సాధించేటోళ్లు ఎంతోమంది.
అయితే.. ఇప్పుడు చెప్పే కుర్రాడు కాస్త భిన్నం. ఎందుకుంటే.. నీట్ రేస్ లో ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు ఉన్న సౌకర్యాలు ఏవీ ఈ కుర్రాడికి లేవు. ఆ మాటకు వస్తే.. రోజువారీ బతుకే కష్టంగా ఉన్న పరిస్థితి. అలాంటి వేళ.. ఆ కుర్రాడు సాధించిన విజయం కొత్త స్ఫూర్తిని ఇస్తుంది. దేశ వ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్షలో.. జమ్మూకశ్మీర్ కు చెందిన అహ్మద్ గనై అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. అతడికి 720 మార్కులకు 601 మార్కులు సాధించాడు. ఏంది? 601 మార్కులు అద్భుతమా? అని ప్రశ్నించొచ్చు.
కానీ.. అతడి గురించి.. అతడి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే.. ఈ ప్రశ్న వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే.. అతడు మిగిలిన విద్యార్థుల మాదిరి కాదు. గడిచిన రెండేళ్లుగా దినసరి కూలీగా పని చేస్తూ.. తనకు లభించిన కొద్ది సమయంలో చదువుకుంటూ.. నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యాడు.
దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. జమ్ముకశ్మీర్ లో ఎంతటి అనిశ్చితి వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందునా పుల్వామా అన్నంతనే తీవ్రవాదుల దాడులు ఎంత ఎక్కువగా ఉంటాయో చప్పున గుర్తుకు వస్తుంది.
పుల్వామా ప్రాంతానికి చెందిన 19ఏళ్ల అహ్మద్ గనై.. పెయింటర్ గా పని చేస్తుంటాడు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అతను రోజుకు రూ.600 చొప్పున పక్క గ్రామాల్లో కూలీ పనులు చేస్తూ.. చదువుకుంటూ ఉంటాడు. గడిచిన రెండేళ్లుగా ఉదయం వేళలో కూలీగా.. సాయంత్రం వేళలో పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యేవాడు.
తాజాగా అతను సాధించిన ర్యాంకు గురించి తెలిసిన వారంతా అతన్ని అభినందిస్తున్నారు. రెండేళ్ల తన శ్రమకు ఫలితం దక్కిందన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న అతడికి.. ఆల్ ద బెస్టు చెప్పాలి. చివరగా తన విజయం గురించి మాట్లాడుతూ.. అతను చెప్పిన మాటల్ని చెప్పకుండా ఈ ఆర్టికల్ ను పూర్తి చేస్తే అసంపూర్ణమే అవుతుంది. ఇంతకూ అతనేమన్నాడంటే.. ''కష్టపడి పని చేయండి. అదెప్పుడూ వృధా కాదు'' అని చెప్పాడు. ఆణిముత్యంలాంటి మాట కదూ?