Begin typing your search above and press return to search.

మోడీ రాజ్యంలో ఇంత బ‌రితెగింపా?

By:  Tupaki Desk   |   5 April 2017 5:07 PM GMT
మోడీ రాజ్యంలో ఇంత బ‌రితెగింపా?
X
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు మాట ఇది. సుదీర్ఘ కాలం పాటు మ్యూట్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న వేళ‌.. ఏదైనా జ‌రిగితే బీజేపీ నేత‌లు అంతెత్తు ఎగిరిప‌డేవారు. రిమోట్‌కు త‌గ్గ‌ట్లు మాట్లాడే ప్ర‌ధాని ఉంటే దేశం ఇలా త‌గ‌ల‌బ‌డుతుంద‌ని తిట్టేసేవారు. మ‌రి.. దీనికి సొల్యూష‌న్ ఏంటి బాసూ అంటే.. మా ఉక్కు ఛాతీ మోడీని కానీ పీఎంను చేయండి.. కుర్చీలో కూర్చుంది మొద‌లు క‌బ‌డ్డీ ఆడేస్తార‌ని కోత‌లు కోసేవాళ్లు. మోడీ పీఎం కావ‌టం ఆల‌స్యం.. దేశం మొత్తం ఛూప్ మంత్ర‌కాళి అన్న‌ట్లు మారిపోతుంద‌ని న‌మ్మ‌బ‌లికేవారు. మోడీ ప్ర‌ధానిగా ప‌ద‌విని చేప‌ట్టి ఒక‌ట్రెండు నెల‌లు అటుఇటూగా మూడేళ్లు అవుతోంది. అప్ప‌టికి.. ఇప్ప‌టికీ అంద‌రికి కొట్టొచ్చిన‌ట్లుగా కనిపించిన తేడా ఏమైనా ఉందంటే.. అప్ప‌ట్లో మ్యూట్ ప్ర‌ధాని ఉండే.. ఇప్పుడు మాట‌ల‌తో మేజిక్ చేసే ప్ర‌ధాని ప‌వ‌ర్‌ లోకి వ‌చ్చారంతే.

ఎందుకింత అక్రోశం అంటే.. ఎన్నిక‌ల వేళ‌.. మోడీ ప‌రివారం చెప్పిన ఏ మాట కూడా ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చింది లేదు. రూపాయి విలువ మా గొప్ప‌గా మారిపోయి.. ఎక్క‌డికో వెళ్లిపోతుంద‌న్న విష‌యం ద‌గ్గ‌ర నుంచి.. పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు భారీగా త‌గ్గిపోతాయ‌ని చెప్పేవారు. ఇక‌.. నిత్య‌వ‌స‌ర వ‌స్తువులైతే కారుచౌక‌గా మార‌తాయ‌ని చెప్పారు. ఇవ‌న్నీ కాలేదు. సర్లే.. స‌ర్దుబాటు చేసుకుందామ‌ని అనుకొని.. క‌నీసం దాయాదికి స‌రిగ్గా బుద్ధి చెప్ప‌టం కానీ.. క‌శ్మీర్ ఇష్యూను ఒక కొలిక్కి తీసుకొచ్చారా? అంటే అదీ లేద‌నే చెప్పాలి.

మ్యూట్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు పాక్ జెండాలు ప‌ట్టుకొని ఆందోళ‌కారులు క‌శ్మీర్ రోడ్ల మీద నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తే.. మాట‌ల మేజిక్ ప్ర‌ధాని మోడీ ప్ర‌ధానిగా ఉంటున్న వేళ‌.. క‌శ్మీరీ క్రికెట‌ర్లు ఏకంగా పాక్ జెర్సీలు ధ‌రించి.. ఆ దేశ జాతీయ గీతాన్ని సైతం ఆల‌పించేసిన దుస్థితి. ఇలాంటి య‌వ్వారాలు క‌శ్మీర్‌లో కొంద‌రు చేస్తుంటారు.. ఆ మాత్రం దానికే ఆవేశ ప‌డొద్ద‌ని చెప్పే వారు ఎవ‌రైనా ఉంటే.. లాగి ఒక్క‌టి పీకాల‌నిపిస్తుంది. ఎందుకంత కోపం అంటే.. ఇంత ఎద‌వ ప‌ని చేసి రెండు రోజులు అవుతున్నా.. బీజేపీ మ‌ద్ద‌తుతో న‌డుస్తున్న ముఫ్తీ మొహ‌బూబా స‌ర్కారు ఇప్ప‌టివ‌ర‌కూ చేసిందేమీ లేదు.

ఈ దుర్మార్గానికి సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. సోష‌ల్ మీడియాలో య‌మా ఫాస్ట్ గా ఉంటూ.. స‌ర్ ప్రైజులు ఇచ్చే మోడీ దృష్టికి ఈ దారుణ వీడియో కంట ప‌డిందో లేదో? చేసిన ఎద‌వ ప‌ని గురించి అడిగితే.. త‌మ జ‌ట్టు కాస్త భిన్నంగా ఉండాల‌న్న ఉద్దేశంతో పాక్ త‌ర‌హా జెర్సీలు వాడిన‌ట్లు చెప్పుకొచ్చారు. మ‌రి.. పాక్ జాతీయ గీతం ఎందుకు ఆల‌పించిన‌ట్లు అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేద‌నే చెప్పాలి. ఇలాంటి వెరైటీగాళ్ల‌కు.. వెరైటీ.. వెరైటీగా కేసులు బుక్ చేసేసి.. లోప‌లేసేస్తే స‌రిపోతుంది. ఈ ఉదంతం గురించి విన్న వెంట‌నే.. మ‌న‌సులో క‌లిగే భావ‌న ఒక్క‌టే.. మోడీ రాజ్యంలో ఇంత ఆరాచ‌క‌మా అని? మ‌రి.. దీనికి మోడీ అండ్ కో ఏం స‌మాధానం చెబుతారు? ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా యాక్ష‌న్ లేని వైనం చూసిన‌ప్పుడు.. మ్యూట్ సింగ్‌ కి.. ఉక్కుఛాతీ మోడీకి తేడా ఏం లేద‌నిపించ‌ట్లేదు? ఆ మాట‌కు వ‌స్తే.. మ్యూట్ సింగ్ కాస్త బెట‌ర్ అనిపించ‌ట్లేదు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/