Begin typing your search above and press return to search.
సీఆర్పీఎఫ్ వాహనంపై ఉగ్రదాడి.. ఓ జవాన్ సహా పౌరుడు మృతి !
By: Tupaki Desk | 1 July 2020 6:30 AM GMTకశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. పుల్వామా తరహా దాడికి బుధవారం ఉదయం ప్రయత్నించారు. ఈ తెల్లవారుజామున బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్ల వాహనంపై దాడికి పాల్పడ్డారు. పెట్రోలింగ్ వాహనంపై విచక్షణారహితంగా ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్ వీరమరణం పొందగా.. మరో పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
అలాగే మరో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఈ ఉగ్రదాడిపై జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బగ్ సింగ్ మాట్లాడుతూ ..ఘటన జరిగిన ప్రాంతంలో కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నామని.. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.