Begin typing your search above and press return to search.

క‌రుణ మ‌ర‌ణం ఆమెకు తెలీద‌ట‌!

By:  Tupaki Desk   |   9 Aug 2018 5:43 AM GMT
క‌రుణ మ‌ర‌ణం ఆమెకు తెలీద‌ట‌!
X
ఒక కీల‌క నేత‌కు ముగ్గురు భార్య‌లు ఉండ‌టం రాజ‌కీయంగా ఎంత ఇబ్బందిక‌ర‌మైన విష‌య‌మో చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. కానీ.. క‌లైంజ‌ర్ క‌రుణానిధికి మాత్రం ఆ ఇబ్బంది పెద్ద‌గా ప‌డిన‌ట్లు క‌నిపించ‌రు. రాజ‌కీయ వైరం ఎంత ఉన్నా.. క‌రుణ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన మూడు పెళ్లిళ్లపై ప్ర‌త్య‌ర్థులు విరుచుకుప‌డిన‌ట్లుగా క‌నిపించ‌దు.

సామాజికంగా కొంత ఇబ్బంది త‌ప్పించి..రాజ‌కీయంగా క‌రుణ‌కు మూడు పెళ్లిళ్ల వ్య‌వ‌హారం ఇరుకున ప‌డేలా చేసింది లేదు. ఇదిలా ఉంటే.. క‌రుణ మ‌ర‌ణం సంద‌ర్భంగా ఒక‌రి విష‌యం తెలిసిన వారంతా అయ్యో అన‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి. త‌న జీవితభాగ‌స్వామి తిరిగి రాని లోకాల‌కు చేరుకున్న విష‌యం తెలియ‌ని వైనం కంట‌త‌డి పెట్టేలా చేస్తోంది. క‌రుణానిధి రెండో భార్య ద‌యాళు అమ్మాళ్‌కు క‌రుణ లేర‌న్న విష‌యం ఇప్ప‌టికి తెలీద‌ట‌.

2016 నుంచి తీవ్ర అనారోగ్యంతో ఉన్న అమ్మాళ్‌కు చుట్టూ ఏం జ‌రుగుతుందో గుర్తించ‌లేని ప‌రిస్థితిలో ఉన్నార‌ట‌. ఆమె జ్ఞాపకశక్తి పూర్తిగా పోయింద‌ని చెబుతారు. క‌ళ్ల ముందు ఏం జ‌రుగుతున్న‌ది ఆమె గ్రహించ‌లేరు. రెండేళ్లుగా ఆమె ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్లు చెబుతారు.

క‌రుణ ఆరోగ్యం విష‌మించిన నేప‌థ్యంలో.. మూడు రోజుల క్రితం పెద్ద‌కొడుకు అళ‌గిరి ఆమెను ఆసుప‌త్రికి తీసుకొచ్చి క‌రుణ వ‌ద్ద కొంత‌సేపు ఉంచి తీసుకెళ్లారు. మంగ‌ళ‌వారం క‌రుణ మ‌ర‌ణించిన త‌ర్వాత ఆయ‌న పార్థిప దేహాన్ని గోపాల‌పురంలోని ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లోనే ఉన్న ఆమెకు.. చుట్టూ ఏం జ‌రుగుతుందో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ కార‌ణంతోనే ఆమెను మెరీనాబీచ్ లో జ‌రిగిన క‌రుణ అంత్య‌క్రియ‌ల‌కు ఆమెను తీసుకెళ్ల‌లేద‌ని చెబుతున్నారు.