Begin typing your search above and press return to search.
కరుణానిధికి చంద్రబాబుకు తేడా అదే..
By: Tupaki Desk | 8 Aug 2018 8:50 AM GMTదేశంలో కొందరు నేతల రూటే సెపరేటు. రాజకీయాల్లో వాళ్లంతా స్ట్రాంగ్ ఇంకెవరూ ఉండరేమో. అనుకున్నది సాధించేవరకు నిద్రపోరు. తాజాగా కరుణానిధి అస్తమయంతో అలాంటి బలమైన నేతలంతా కనుమరుగైనట్లయింది.
1969 నుంచి కరుణ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉన్నారు. 1990 నుంచి 2014 వరకు కేంద్ర ప్రభుత్వాల్లో ఆయన పార్టీ డీఎంకే ఉంది. అయితే... ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రుల సమావేశాలు ఉన్నప్పుడు తప్ప ఆయన ఎన్నడూ దిల్లీ వెళ్లేవారు కాదు.
కేంద్ర ప్రభుత్వంలో చేరాలన్నా... మద్దతు ఉపసంహరించుకోవాలన్నా.. మంత్రి పదవుల లెక్కలు డిసైడ్ చేయాలన్నా.. ఏదైనా కానీ దిల్లీ నేతలే కరుణ వద్దకు వచ్చేవారు. చివరకు ప్రధాన మంత్రులు కూడా ఆయన వద్దకు వచ్చి ఆయనతో రాజకీయ చర్చలు జరిపేవారు. అంతేకానీ... కరుణ ఎన్నడూ దిల్లీ వెళ్లేవారు కాదు. ప్రస్తుత కాలంలో చాలామంది సీఎంలు ముప్ఫయి నలభైసార్లు దిల్లీ వెళ్లి ఒక్క పని కూడా సాధించుకుని రాలేకపోతున్న తరుణంలో కరుణ ఇలా దిల్లీనే తన వద్దకు రప్పించుకునేవారంటే ఆయనెంత బలమైన నేతో అర్థం చేసుకోవచ్చు.
కరుణానిధి మాదిరిగానే శివసేన లెజండ్ బాల్ ఠాక్రే కూడా దిల్లీ మొఖం చూసేవారు కాదు. వాజపేయి - అద్వానీ వంటి మహామహులు కూడా ముంబయి వచ్చి ఠాక్రేను కలిసివెళ్లేవారు.
దేశంలో తానే అత్యంత సీనియర్ రాజకీయ నేతని చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడి తీరు ఇందుకు పూర్తిగా భిన్నం. ప్రధాని - మంత్రలు అపాయింట్ మెంట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కాళ్లరిగేలా దిల్లీ తిరుగుతారు. అలా అని పని సాధించుకురావడంతో మాత్రం ఆయన సక్సెస్ రేట్ చాలా తక్కువని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు... అప్పుడెప్పుడో జాతీయ రాజకీయాలను గిరగిరా తిప్పి పడేశానని చెప్పుకొనే ఈ స్వయం ప్రకటిత కింగ్ మేకర్ కు జాతీయ స్థాయిలో పెద్దగా స్నేహితులనూ సంపాదించుకోలేకపోయారు. మొన్న పార్లమెంటులోఅవిశ్వాసం పెడితే ఆయనకు మద్దతిచ్చే పార్టీలే కనిపించలేదు.
అందుకే.. దిల్లీ ఎన్నిసార్లు వెళ్లామని కాదన్నయ్యా... దిల్లీ మన దగ్గరకు ఎప్పుడైనా పరుగెత్తుకుని వచ్చిందా అన్నది ఇంపార్టెంటు అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు.