Begin typing your search above and press return to search.

రూ.109 కోట్ల పన్ను బకాయి.. నోటీసు వచ్చింది ఎవరికంటే?

By:  Tupaki Desk   |   18 Dec 2020 1:30 AM GMT
రూ.109 కోట్ల పన్ను బకాయి.. నోటీసు వచ్చింది ఎవరికంటే?
X
ఆ వ్యాపారికి జీఎస్టీ విభాగం నుంచి ఒక నోటీసు వచ్చింది. దాని సారాంశం.. మీరు రూ.109 కోట్ల బకాయిలు పడ్డారు. వెంటనే ఆ పన్ను మొత్తాన్ని చెల్లించమని. ఆ నోటీసును అందుకున్న ఆ వ్యాపారి బిక్క ముఖం వేశారు. ఎందుకంటే.. అతడిది టీ కొట్టు. ఇటీవల కాలంలో ఇలాంటి సిత్రాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఒడిశాలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఉక్కునగరం రైర్కెలా కోయల్ నగర్ ప్రాంతంలో టీ కొట్టు వ్యాపారి కార్తీక్ కమిట అనే చిన్న వ్యాపారికి రూ.109 కోట్లు జీఎస్టీ బాకీ ఉన్నట్లుగా తాఖీదు వచ్చింది. వాస్తవానికి సదరు టీ కొట్టు వ్యాపారి కార్తీక్ సంతకం కూడా చేయలేని నిరక్షరాస్యుడు. అయితే.. అతన్ని బడా షాపింగ్ మాల్ యజమానిగా జీఎస్టీ అధికారులు పేర్కొంటున్నారు. పలు అగ్రిమెంట్లు కూడా చేసుకున్నట్లుగా వారు చెబుతుున్నారు.

అయితే.. చదువుకోని.. చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తికి ఇంత భారీ మొత్తంలో పన్ను బకాయిలు పడినట్లుగా నోటీసులు రావటం సంచలనంగా మారింది. ఇది మీడియాలో పెద్ద ఎత్తున రావటంతో అధికారులురంగంలోకి దిగారు. తాము పంపిన నోటీసుల్లో తప్పు ఎక్కడ దొర్లిందన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

చివరకు తేలిందేమంటే.. నోటీసులు తప్పులు దొర్లినట్లుగా తేలింది. కార్తీక్ కు చెందిన విద్యుత్ బిల్లులు దాఖలు చేసిన సంస్థ ఈ దుర్మార్గానికి పాల్పడినట్లుగా గుర్తించారు. ఇంతకీ.. ఇతగాడి ఆధార్ వివరాలు సదరు సంస్థకు ఎలా వచ్చాయన్న విషయంలోకి వెళితే.. అతను ఏ ఆవరణలో అయితే టీ బంకు పెట్టుకున్నాడో.. అక్కడో షాపింగ్ మాల్ ఉంది. అందులోని లింగరాజ్ ట్రేడింగ్ కంపెనీ ఈ మోసానికి పాల్పడినట్లుగా గుర్తించారు.