Begin typing your search above and press return to search.

భన్సాలీ త‌ల్లిపై అదిరిపోయే నిజాల‌తో సినిమా తీస్తాం

By:  Tupaki Desk   |   26 Jan 2018 8:32 AM GMT
భన్సాలీ త‌ల్లిపై అదిరిపోయే నిజాల‌తో సినిమా తీస్తాం
X
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన పద్మావత్ చిత్రం విడుదలపై కొనసాగుతున్న నిరసనలు మ‌రోమ‌లుపు తిరిగాయి.ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ ప‌ద్మావ‌తి. జ‌న‌వ‌రి 25న విడుద‌లైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ పొందింది. ప‌లు వివాదాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమాని నిలిపివేయాల‌ని ఇప్ప‌టికీ ఆందోళ‌న‌లు చేస్తున్నారు క‌ర్ణిసేన కార్య‌క‌ర్త‌లు. పోలీసుల సెక్యూరిటీతో కొన్ని చోట్ల ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికి, రాజ్‌ పుత్‌ ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్‌ - రాజస్థాన్‌ - గోవా - గుజరాత్‌ రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో తొలిరోజు ‘పద్మావత్‌’ విడుదల నిలిచిపోయింది.

అయితే తాజాగా చిత్తోర్‌ గఢ్‌ జిల్లా కర్ణి సేన అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ కంగరౌత్‌ గురువారం మీడియా సమావేశం నిర్వహించి తాము సంజ‌య్ లీలా భ‌న్సాలీ త‌ల్లి ‘లీలా భన్సాలీ’పై సినిమా చేయ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. భ‌న్సాలీ.. ప‌ద్మావ‌త్ మూవీతో మా త‌ల్లి రాణి ప‌ద్మావ‌తిని అవ‌మానించారు. కాని మేం చేయ‌బోవు సినిమా చూసి సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఖ‌చ్చితంగా గ‌ర్వ‌ప‌డ‌తార‌ని ఆయ‌న అన్నారు. ఈ మూవీకి ‘‘లీలా కి లీలా’’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన క‌ర్ణిసేన‌ అరవింద్ వ్యాస్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీని తెర‌కెక్కించ‌నున‌న్న‌ట్టు ప్ర‌క‌టించారు. వ‌చ్చే నెల‌లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంద‌ని గోవింద్ సింగ్ అన్నారు. ‘దేశంలో ప్రతీ పౌరుడికి స్వేచ్ఛా హక్కు ఉంటుంది అనే అంశాన్ని ప‌ట్టుకొని పద్మావత్‌ను భన్సాలీ తెరెక్కించారు. సరిగ్గా అదే హక్కును ఉప​యోగించుకుని అంతకంటే భేషుగ్గా.. మేం పచ్చి నిజాలను చూపిస్తాం’ అని కర్ణిసేన ప్రకటించింది .

మ‌రోవైపు సినిమా విడుద‌ల నేప‌థ్యంలో గుజరాత్ - మధ్యప్రదేశ్ - మహారాష్ట్ర - రాజస్థాన్ రాష్ర్టాల్లో ఆందోళనకు దిగిన రాజ్‌ పుత్ కర్ణిసేన కార్యకర్తలు రహదారులపై విధ్వంసం సృష్టించారు. 40వాహనాలకు నిప్పుపెట్టారు. 200కు పైగా వాహనాలను ధ్వంసం చేశారు. సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో పద్మావత్ సినిమా దేశవ్యాప్తంగా విడుదల కావ‌డంతో ఇప్పటివరకు హెచ్చరికలకే పరిమితమైన రాజ్‌ పుత్ సంఘాలు అనంత‌రం రెచ్చిపోయాయి. పద్మావత్ సినిమా విడుదలను వ్యతిరేకిస్తూ గుజరాత్‌ లో హింస చెలరేగింది. సినిమావిడుదలను అడ్డుకుంటామని హెచ్చరించిన కర్ణిసేన అహ్మదాబాద్‌లో థియేటర్లపై దాడులకు పాల్పడింది. సినిమా విడుదల అవుతున్న పలు థియేటర్లు - మాల్‌ లపై ఆందోళనకారులు దాడిచేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఓ మాల్‌ పైకి పెట్రోల్‌ బాంబులను విసిరినట్లు పోలీసులు గుర్తించారు. 30కిపైగా వాహనాలను తగులబెట్టారు. కర్ణిసేన దాడిలో 200కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయని తెలుస్తున్నది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారుల్ని చెదురగొట్టారు.