Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాలకు భారీగా దెబ్బేస్తున్న కర్ణాటక!
By: Tupaki Desk | 28 July 2019 12:17 PM GMTమరో మూడు రోజుల్లో జులై పూర్తి అవుతోంది. ఆగస్టులోకి ఎంట్రీ ఇచ్చేస్తాం కూడా. క్యాలెండర్లో జులై దాటిపోయినంతనే ఆయా రాష్ట్రాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా నీటితో కళకళలాడే పరిస్థితి. తాజాగా అందుకు భిన్నమైన దుస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షం ముఖం చాటేయటంతో ఇప్పటికే ఇబ్బంది పడుతుంటే.. వర్షాలు పడిన రాష్ట్రాల నుంచి ప్రాజెక్టులకు రావాల్సిన నీరు పత్తా లేకుండా పోతోంది.
పొరుగున ఉన్న కర్ణాటక నుంచి ఆల్మట్టి డ్యామ్ ద్వారా దిగువన ఉన్న శ్రీశైలం.. నాగార్జున సాగర్ లకు రావాల్సిన నీరు ఇప్పటివరకూ రాని పరిస్థితి. గడిచిన 20 రోజుల్లో కర్ణాటకలో కురిసిన వర్షాల కారణంగా ఆల్మట్టి డ్యామ్ లోని 90 శాతం మేర నీటి నిల్వలలు చేరుకున్నాయి. శనివారం సంగతే చూస్తే.. 1703 అడుగుల ఎత్తులో నీటి నిల్వలు ఉన్నాయి. ఒకే రోజు 22593 క్యాసెక్కుల వరద నీరు వచ్చి చేరింది.
ఆల్మట్టి డ్యామ్ సామర్థ్యానికి మించి వస్తున్న నీటి నిల్వలతో దిగువన ఉన్న ప్రాజెక్టులకు నీరు వస్తుందని ఆశించిన వారికి ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇప్పటికే వచ్చిన ఇన్ ఫ్లో ప్రకారం దిగువన ఉన్న జూరాల.. శ్రీశైలం జలాశయాల్లోకి నీళ్లు రావటమే కాదు.. అక్కడ నిండు కుండల్లా ప్రాజెక్టులు మారాల్సిన పరిస్థితి. అందుకు భిన్నంగా కర్ణాటక నుంచి వచ్చిన జలాల లెక్కలు చూస్తున్న ఇరిగేషన్ అధికారులకు నోట మాట రావట్లేదు.
ఇప్పటివరకూ కర్ణాటక నుంచి దిగువకు వచ్చిన జలాలు కేవలం 3,045 క్యూసెక్కులు మాత్రమే. తుంగభద్ర వద్దకు కృష్ణా జలాలు చేరినా.. వెంటనే కాలువల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు చేపడుతున్న తీరుతో తెలుగు రాష్ట్రాలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లే పరిస్థితి. ఆల్మట్టితోపాటు నారాయణపూర్ లోనూ ఇదే తీరు నడుస్తోంది. ఈ ప్రాజెక్టులోకి 1609 అడుగులకు నీటి నిల్వలు చేరుకున్నాయి. వరద ప్రవాహం డ్యామ్ లో 3,628 క్యూసెక్కులకు చేరగా.. బయటకు మాత్రం తక్కువ నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్రకు 15212 క్యూసెక్కుల నీరు చేరితే.. బయటకు 1805 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు.
ఇప్పుడు విడుదల చేసిన నీటి లెక్కన కనుక విడుదల చేసిన పక్షంలో శ్రీశైలం.. శ్రీరాంసాగర్.. నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండేది ఎప్పటికన్న ప్రశ్న తలెత్తక మానదు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 178.74 టీఎంసీలకు ప్రస్తుతం 31.22 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా.. సాగర్ లో 312 టీఎంసీలకు 123 సీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. కర్ణాటక తీరు మారకుంటే ఈ ప్రాజెక్టులు నిండేది ఎప్పటికన్నది ప్రశ్నగా మారింది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని.. తాజాగా తనకు వచ్చిన వరద నీటిని దిగువ ప్రాంతాలకు..కాలువలకు.. పంటపొలాలకు నీటిని విడుదల చేస్తుండటంతో వచ్చిన నీరు వచ్చినట్లుగా తను వాడేసుకుందే తప్పించి.. దిగువనకు నీళ్ల రాని పరిస్థితి. ఇదే తీరుకంటిన్యూ అయి.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అంతంతమాత్రంపడితే మాత్రం.. ఈ ఏడాది నీటి కోసం తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది.