Begin typing your search above and press return to search.
అన్నా చెల్లెల మంటూ సహజీవనం. చావు బతుకుల్లోని ప్రియురాలిని ఆస్పత్రికి తెచ్చి పరార్..
By: Tupaki Desk | 25 Oct 2020 2:30 PM GMT కర్ణాటక రాష్ట్రం ఉడిపి లో దారుణ సంఘటన జరిగింది. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ఓ యువతిని ఆసుపత్రికి తీసుకు వచ్చిన యువకుడు ఆ తర్వాత అక్కడి నుంచి మాయమయ్యాడు. ఆ యువతి కన్నుమూసింది. పోలీసుల దర్యాప్తులో యువతి ప్రియుడైన ప్రశాంత్ కుందర్ అనే వ్యక్తి ఆమెను అక్కడ వదిలేసి పారిపోయినట్లు గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో ఓ యువకుడు ఆటోలో యువతిని తీసుకుని వచ్చాడని.. అతడు ఆమెను ఆసుపత్రికి తీసుకు వచ్చే సరికి ఆమె చావు బతుకుల్లో ఉందని.. ఆమెను అక్కడ అడ్మిట్ చేసిన వెంటనే అతడు అక్కడి నుంచి మాయమైనట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపి ఆమెను ఆసుపత్రికి చేర్చింది ఆమె ప్రియుడు ప్రశాంత్ కుందర్ అని.. అతడికి అంతకుముందే పెళ్లి కూడా అయిందని నిర్ధారించారు. లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అతని గురించి మరిన్ని విషయాలు తెలిశాయి.
ప్రశాంత్ కుందర్ ఊరు బైండూరు తాలూకా జడ్కల్. అతడు మంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ చేసే సమయంలో ఉడిపి సమీప కుక్కహళ్లికి చెందిన రక్షిత నాయక్ (22) పరిచయం అయ్యింది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమించుకున్నారు. కొద్ది రోజులు మంగళూరులోనే గది అద్దెకు తీసుకుని అన్నాచెల్లెళ్ల మని చెప్పి సహజీవనం చేశారు. ఆ తరవాత ప్రశాంత్ కి వివాహమైంది. ప్రస్తుతం అతను ఉడిపిలో కాపురం ఉంటున్నాడు. కాగా పెళ్లికి ముందే ప్రశాంత్ నడిపిన ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న అతడి భార్య ఆమెకు ఫోన్ చేసి దుర్భాషలాడింది. ఇదిలా ఉండగా శనివారం ప్రశాంత్ చావు బ్రతుకుల్లో ఉన్న తన ప్రియురాలిని ఉడిపి లోని గాంధీ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి అడ్మిట్ చేయించి అక్కడినుంచి పారిపోయాడు. ఆ తర్వాత ఆమె చనిపోయింది. అసలు రక్షిత ఉడిపికి ఎందుకు వచ్చింది.. అర్ధరాత్రి చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చేరే ముందు ఏంజరిగింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా..లేకుంటే హత్యకు గురైందా అన్నది సస్పెన్స్ గా మారింది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి ప్రశాంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.