Begin typing your search above and press return to search.
ప్రభుత్వోద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి
By: Tupaki Desk | 30 Aug 2018 1:45 PM GMTఆ గట్టునుంటావా విద్యార్థి ...ఈ గట్టుకొస్తావా....అంటూ మొన్నా మధ్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన అధ్యాపకులుంటారని...ఉచితంగా విద్యాదానం చేసేందుకు వారు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని ఆ పోస్ట్ సారాంశం. కాబట్టి, తల్లిదండ్రులందరూ తమ పిల్లలను వేలకు వేలు పోసి ప్రైవేటు స్కూళ్లలో చదివించకుండా....సర్కారీ బళ్లలో చేర్పించాలనేది ఆ పోస్టును రూపొందించిన ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఉద్దేశం. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల పిల్లలు ఎంతమంది ....తమ తల్లిదండ్రులు చదువు చెబుతోన్న పాఠశాలల్లో చేరుతున్నారు....లేదా వేరే ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్నారన్నది సగటు మనిషికి వచ్చే సాధారణ ప్రశ్న. అయితే, ఆ పోస్టును బట్టి ఏపీలో చలనం రావడం సంగతి పక్కనబెడితే....తాజాగా కర్ణాటక సర్కార్ ....ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇకపై, కర్ణాటక ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు... తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా చర్యలు తీసుకునేందుకు నిబంధనలను సిద్ధం చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతమైన విద్య అందించడం, సదుపాయాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఆ నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మహేష్ తెలిపారు. సర్కారీ బళ్లలో చదివే పిల్లల సంఖ్య పెరగాలన్న మంచి ఉద్దేశంతో సరికొత్త విద్యా విధానం తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ పాఠశాలల అభివృద్ధిలో ఉద్యోగస్తులను భాగస్వామ్యులను చేయాలని భావిస్తున్నామన్నారు. కానీ, న్యాయపరంగా లేదా చట్టపరంగా ఈ కొత్త ఆలోచన నిలుస్తుందో లేదో చెప్పలేమని మహేష్ అన్నారు. ఈ నిబంధనల అమలుపై న్యాయనిపుణుల సలహా కోరినట్లు తెలిపారు. పిల్లలు ఎక్కడ చదవాలో రాష్ట్రప్రభుత్వాలకు నిర్ణయించే అధికారం లేదంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా వెళ్లలేమని స్పష్టం చేశారు. మరి, కర్ణాటక సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి