Begin typing your search above and press return to search.

పీకేయాల్సిందేనా...సునీల్ కనుగోలుకే డిమాండ్ అంతా!

By:  Tupaki Desk   |   15 May 2023 10:25 AM GMT
పీకేయాల్సిందేనా...సునీల్ కనుగోలుకే డిమాండ్ అంతా!
X
పదేళ్ళుగా ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే అగ్ర భాగంగా ఉన్నారు. ఆయన వ్యూహాలు బ్రహ్మాండంగా ఒక దశలో పనిచేశాయి. చాలా చోట్ల అధికార పీఠాలను కూడా కదిలించాయి. పీకే వ్యూహాలు అందించిన పార్టీలకు అప్పగించాయి. పీకే ఎక్కడ ఉంటే అక్కడ కుర్చీ ఖాయమన్న నమ్మకాన్నీ కలిగించాయి.

కానీ అది ఫ్లాష్ బ్యాక్ అవుతోంది. ఆ వైభవం కరుగుతోంది. పీకే అంటే పీకేయాల్సిందే అని అంటున్న పరిస్థితి వస్తోంది. ఎందుకంటే ఆయన వ్యూహాలు ఓల్డ్ అయిపోయాయట. అవును అవే వ్యూహాలు అవే నినాదాలు. అవే రోత తొడ్డ కొట్టుడు స్లోగన్స్ దాంతో ఎప్పటికపుడు మారుతున్న ప్రజానీకానికి స్మార్ట్ గా ఫోన్లను చేతిలో పెట్టుకుని కాలం కంటే బుర్రలను చురుకుగా పరిగెత్తించే జనాలకూ ఇపుడు కనెక్ట్ కాలేకపోతున్నాయట.

అందుకే పీకే వ్యూహాలు లెక్క తప్పుతున్నాయి. దెబ్బ తీస్తున్నాయి. చిత్రమేంటి అంటే పీకే టీం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అధికార పార్టీలకు పనిచేస్తోంది. ఇక కాంగ్రెస్ కి దేశవ్యాప్తంగా సునీల్ కనుగోలు అనే ఒక స్ట్రాటజిస్ట్ ఉన్నారు. ఆయనతో కధ నడిపిస్తోంది. రీసెంట్ గా కర్నాటకలో ఆ పార్టీ బ్లాస్టింగ్ సక్సెస్ తో సునీల్ కనుగోలు వెలుగులోకి వచ్చారు.

ఆయన స్లోగన్స్ గన్స్ లా పేలాయి. ఆయన వ్యూహాలు ప్రత్యర్ధులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి. చివరికి అదిరిపోయే విజయం కాంగ్రెస్ ఖాతాలో పడింది. సునీల్ కనుగోలు ఒక సామన్యుడిగా ఉంటారు. ఆయన లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తారు. ఎక్కడా ఆయన్ ఫోటో కనిపించదు. ఎక్కడా ఆయన మాట వినిపించదు.

సైలెంట్ ఆపరేషన్ అలా చేసుకుంటూ పోతారు. ఆయన కాంగ్రెస్ కోర్ కమిటీలో మెంబర్ గా కూడా ఉన్నారు. ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తు చేయడంలో సిద్ధ హస్తుడుగా పేరు తెచ్చుకున్నారు. కర్నాటకలో ఆయన వదిలిన ఒక స్లోగన్ ఫార్టీ పర్సెంట్ సర్కార్ అన్నది జనాల్లోకి దూసుకునిపోయింది. ఎంతలా అంటే దాన్ని కౌంటర్ చేసే పరిస్థితి కూడా లేనంతలా.

అదే చివరికి బీజేపీ సర్కార్ కి డ్యామేజ్ చేసి సీట్లను లేకుండా కాకుండా చేసి పారేసింది. అలాగే మరో స్లోగన్ పేసీఎం పేసీఎం క్రై పీఎం అన్న స్లోగన్స్ కూడా సూపర్ లెవెల్ లో వైరల్ అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ కనుగోలు బుర్ర నిండా వ్యూహాలే. మాటలన్నీ స్లోగన్లే అన్నట్లుగా తయారయ్యారు.

ఆ మధ్యన ఆయన హైదరబాద్ ఆఫీసు మీద తెలంగాణా సర్కార్ పోలీస్లు దాడి చేసి మొత్తం కంప్యూటర్లు అన్నీ తీసుకుని వెళ్లారు. అలా కర్నాటక ఎన్నికల స్ట్రాటజీ మొత్తాన్ని తీసుకెళ్ళి బీయారెస్ ద్వారా బీజేపీకి అందించారని ఒక ప్రచారం జరిగింది. సునీల్ కనుగోలు అయినా ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా దూసుకుపోయారు. కొత్త స్ట్రాటజీలతో ముందుకు వచ్చారు. దాని ఫలితమే ఈ కర్నాటక ఎన్నికల విజయం.

తెలంగాణా కాంగ్రెస్ కి కూడా సునీల్ కనుగోలు పనిచేస్తున్నారు. దీంతో ఇపుడు అసలైన ఫైట్ పీకే వర్సెస్ సునీల్ కనుగోలు అన్నట్లుగా అక్కడ మారింది. మరి పీకే మూడవసారి బీయారెస్ ని గెలిపిస్తాడా, లేక సునీల్ కాంగ్రెస్ కి తెలంగాణాలో పట్టం కట్టేలా చూస్తారా అన్నదే పాయింట్.

చూడాలి మరి ఏమి జరుగుతోందో. ఏది ఏమైనా అవుట్ డేటెడ్ వ్యూహాలతో సక్సెసులు రావు అని అంటున్నారు. ఇంతకీ పీకే అవుట్ డేటెడ్ అయిపోతున్నారా. ఏమో కాంట్రాక్ట్ తీసుకున్న పార్టీలు, సక్సెస్ రేట్లే ఆ సంగతి చెప్పాల్సి ఉంది.