Begin typing your search above and press return to search.
'కుమార' రాజకీయానికి గండి కొడుతోందెవరు? కర్ణాటక రాజకీయాల్లో కలకలం!
By: Tupaki Desk | 11 May 2023 3:08 PM GMTకర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే జేడీఎస్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచే అవకాశం ఉన్నా.. 25 నియోజకవర్గాల్లో తమ పార్టీకి ఎదురు దెబ్బ తగలొచ్చని అంచనా వేశారు. దీనికి డబ్బులు లేకపోవడమే కారణమని ఆయన పేర్కొన్నారు. బుధవారం కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగానే.. బిదాదిలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
"మా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో అనేక మందికి నేను ఆర్థికంగా అండగా నిలవలేకపోవడం నాకు బాధ కలిగించింది. నిధుల విషయంలో ప్రజల నుంచి నాకు సాయం లభిస్తుందని ఆశించా. కానీ అలా జరగలేదు. జేడీఎస్ కు గెలవగల నేతలు ఉన్న చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపుర వంటి అనేక నియోజక వర్గాల్లో.. అభ్యర్థుల కు అండగా నిలవడంలో నేను విఫలమయ్యాను." అని కుమారస్వామి చెప్పారు.
కర్నాటకలో మూడు ప్రధాన పార్టీలు గణనీయంగా ఖర్చు చేశాయని అన్ని వర్గాలు భావిస్తున్నారు. అయితే, కుమారస్వామి మాత్రం డబ్బులేకే తాము 25 నియోజకవర్గాలు కోల్పోతున్నామని ప్రకటించడం వెనుక ఏదో రహస్యం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో ఖర్చు చేసేందుకు కుమారస్వామికి పెద్ద ఎత్తున నిధులు అందజేస్తానని ఓ రాజకీయ నాయకుడు హామీ ఇచ్చినా చివరికి ఆ హామీని నెరవేర్చలేదని తెలుస్తోంది.
వాగ్దానం మేరకు నిధులు ఇవ్వకపోవడానికి కారణాలు తెలియవు. కానీ, ఓడిపోయిన పార్టీ కోసం రాజకీయ నాయకుడు డబ్బును వృధా చేయకూడదని చాలా మంది అనుకుంటారు, ఇది ధోరణిని గమనించిన తర్వాత వారు గ్రహించి ఉంటారు. ఈ నిధిపైనే ఆధారపడ్డ కుమారస్వామి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో చివరి నిమిషంలో క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకున్నట్లు అంతర్గత సమాచారం.
అయితే మూడేళ్ల క్రితం వరకు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారనేది తెలిసిందే. ఇటీవల ఆయన అధికారంలో లేరన్నారు. ఇంత నగదు కొరతతో ఆయన ఎలా ఇబ్బంది పడుతున్నారనేది రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చగా మారింది. ఇదిలావుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో.. జేడీఎస్ కు ఉన్న సాన్నిహిత్యం తెలిసిందే. అంతేకాదు.. ఎన్నికల్లోనూ కేసీఆర్ సాయం చేస్తారని చర్చ సాగింది. కానీ, కేసీఆర్ ఎలాంటి సాయం చేయకపోవడం గమనార్హం.