Begin typing your search above and press return to search.

ఒక‌రు రిజ‌ర్వేష‌న్లు.. మ‌రొక‌రు టిప్పు-బ‌స‌వ‌ణ్ణ‌.. క‌ర్ణాట‌క‌ రాజ‌కీయం ఉక్కిరిబిక్కిరి

By:  Tupaki Desk   |   24 April 2023 3:00 PM GMT
ఒక‌రు రిజ‌ర్వేష‌న్లు.. మ‌రొక‌రు టిప్పు-బ‌స‌వ‌ణ్ణ‌.. క‌ర్ణాట‌క‌ రాజ‌కీయం ఉక్కిరిబిక్కిరి
X
క‌ర్ణాటక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాజ‌కీయాలు రంగులు మారుతున్నాయి. ఎవ‌రికి వారు వ్యూహాత్మ‌కంగా సాగుతు న్నారు. అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకుని ముందుకు పోతున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ప్రాతిప‌దిక‌గా చేసుకుని రాజ‌కీయాల‌ను ఊపేస్తోంది. ముస్లింల‌కు ఇచ్చిన 4 శాతం రిజ‌ర్వేష‌న్‌ను ఇట‌వ‌లే బీజేపీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ విష‌యాన్ని కాంగ్రెస్ రాజ‌కీయం చేస్తోంది.

అయితే బీజేపీ నాయ‌కులు మాత్రం మ‌త ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తు న్నారు. అందుకే తాము 4 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను లింగాయ‌త్‌ల‌కు, వ‌క్క‌లిగ‌ల‌కు కేటాయించామ‌ని చెబుతు న్నారు. దీంతో అటు కాంగ్రెస్‌ ఇటు బీజేపీల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ జోరుగా సాగుతోంది. ఇదిలావుంటే కాంగ్రెస్ రెండు కీల‌క విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తోంది. ఒక‌టి టిప్పు సుల్తాన్‌, రెండు 12వ శ‌తాబ్దానికి చెందిన బ‌స‌వ‌ణ్ణ‌.

మైసూరును కేంద్రంగా చేసుకుని టిప్పు సుల్తాన్‌ పాలించారు. ఈయ‌న‌ను కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది. అదేస‌మ‌యంలో బీజేపీ టిప్పును విమ‌ర్శిస్తోంద‌ని. ఆయ‌న జ‌యంతుల‌ను నిర్వ‌హించ‌డం లేద‌ని కాంగ్రెస్ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. తాము అధికారంలోకి వ‌స్తే టిప్పు జ‌యంతులు నిర్వ‌హిస్తామ‌ని కూడా పేర్కొంటోంది. ఇక‌, 12వ శ‌తాబ్దానికిచెందిన బ‌స‌వణ్ణ ను కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోంది.

ప్ర‌జాస్వామ్యానికి స‌మానత్వానికి బ‌స‌వ‌ణ్ణ ఎంతో ప్రాధాన్యం ఇచ్చార‌ని.. ఆయ‌నను, ఆయ‌న సిద్ధాంతాల ను బీజేపీ అణిచి వేస్తోంద‌ని బీజేపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాము అధికారంలోకి వ‌స్తే బ‌స‌వ‌ణ్ణ ఆశ‌యాల‌ను అభివృద్ధి చేస్తామ‌ని చెబుతున్నారు. మొత్తంగా బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ ఎన్నిక‌ల వ్యూహాలు రోజుకోర‌కంగా మారుతున్నాయి. ఎన్నిక‌ల‌కు మ‌రో 18 రోజులు మాత్ర‌మే గ‌డువు ఉండ‌డం గ‌మ‌నార్హం.