Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ వాట్స‌ప్ నుంచి బూతు వీడియోలు

By:  Tupaki Desk   |   3 May 2017 8:09 AM GMT
ఎమ్మెల్సీ వాట్స‌ప్ నుంచి బూతు వీడియోలు
X
క‌ర్ణాట‌క రాష్ట్రంలోని ఒక ఎమ్మెల్సీ య‌వ్వారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక‌ వాట్స‌ప్ గ్రూప్ లో స‌భ్యుడైన ఈ ఎమ్మెల్సీ వాట్స‌ప్ అకౌంట్ నుంచి విచ్చ‌ల‌విడిగా బూతు వీడియోలు షేర్ కావ‌టంతో నోటి వెంట మాట రాని ప‌రిస్థితి. ఆయ‌న గ్రూప్‌లో ఉన్న వారిలో నేత‌లు.. అధికారులు.. ప‌లువురు మీడియా ప్ర‌తినిధుల‌తో స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు ఉండ‌టంతో ఇప్పుడీ విష‌యం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకిలా అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాన‌ప్ప‌టికీ.. స‌ద‌రు ఎమ్మెల్సీ తీరు ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకునే ప‌రిస్థితి.

బెళ‌గావి న‌గ‌రంలో బెల్గాం మీడియా ఫోర్స్ అనే వాట్స‌ప్ గ్రూప్ ఉంది. ఇందులో ప‌లువురు ప్ర‌ముఖులు.. వివిధ వ‌ర్గాల‌కు చెందిన వారు స‌భ్యులుగా ఉన్నారు. ఇలాంటి వారిలో స్థానిక బీజేపీ ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. ఆయ‌న మొబైల్ వాట్స‌ప్ నుంచి 50కి పైగా బూతు వీడియో క్లిప్‌ లు బెల్గాం మీడియా ఫోర్స్ గ్రూప్‌ కి షేర్ కావ‌టంతో క‌ల‌కలాన్ని రేపింది. ఇంత పెద్ద ఎత్తున బూతు వీడియోలు పోస్ట్ కావ‌టం పెను సంచ‌ల‌నంగా మారింది. ఇది జ‌రిగిన నాటి నుంచి స‌ద‌రు ఎమ్మెల్సీ ఫోన్ స్విచాఫ్ చేయ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఎమ్మెల్సీ వారి ఫోన్లో బూతు వీడియోలు ఎన్ని ఉన్నాయో? అంటూ ప‌లువురు మాట్లాడుకోవ‌టం క‌నిపిస్తోంది. ఈ ఉదంతంపై కొంద‌రు వ్యాఖ్యానిస్తూ.. ఎమ్మెల్సీ ఫోన్ బూతు వీడియోల గ‌నిలా ఉన్న‌ట్లుగా ఉంద‌న్న వ్యాఖ్య‌ను చేయ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/