Begin typing your search above and press return to search.
జర్నలిస్టుకు కరోనా..భయాందోళనతో క్వారంటైన్ లోకి మంత్రులు
By: Tupaki Desk | 30 April 2020 2:00 PM GMTకర్ణాటక కరోనా ప్రభావం తక్కువనే ఉన్నా ఆ కేసులు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. వింత వింత ఘటనలు ఆ రాష్ట్రంలో చోటుచరేసుకుంటున్నాయి. గతంలో కరోనా బాధితుడు మృతిచెందడం.. అంతకుముందు కరోనా బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా పెద్ద సంఖ్యలో స్థానికులు పోలీసులు, వైద్యులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ కరోనా భయంతో ఏకంగా నలుగురు మంత్రులు క్వారంటైన్‌కు వెళ్లారు. ఎందుకంటే ఓ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ నలుగురు మంత్రులు భయాందోళనకు గురయ్యారు.
కర్నాటకలో ఓ స్థానిక టీవీ ఛానెల్ వీడియో జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 24వ తేదీన అతడికి వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. అయితే కరోనా సోకిందని తెలియక ఏప్రిల్ 21, -24వ తేదీల్లో నలుగురు మంత్రులను కలిశాడు. తాజాగా అతడికి కరోనా వైరస్ సోకిందని తేలడంతో ఆ నలుగు మంత్రులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వత్థ నారాయణ, హోంమంత్రి బస్వరాజ్ బొమ్మై - వైద్య, -విద్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ - పర్యాటక మంత్రి సీటీ రవి క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈ మేరకు తాము హోం క్వారంటైన్ లో ఉంటున్నట్లు ఆ మంత్రులు ట్విట్టర్లో ప్రకటించారు. దీంతో పాటు వీడియో జర్నలిస్టుతో కాంటాక్ట్ లోకి వచ్చిన కనీసం 40 మందిని క్వారంటైన్ కు అక్కడి అధికారులు తరలించారు.
ముందస్తుగానే వారు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా.. అయినా ముందు జాగ్రత్తగా క్వారంటైన్ కు వెళ్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. కర్ణాటకలో ఇప్పటివరకు 532 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 215 మంది రోగులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు ఉండడంతో లాక్ డౌన్ ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే మంత్రులు ఈ విధంగా క్వారంటైన్ పోవడం గమనార్హం.