Begin typing your search above and press return to search.
కర్ణాటక లేటెస్ట్ నంబర్ గేమ్..!
By: Tupaki Desk | 16 July 2019 6:54 AM GMTకర్ణాటకలోని కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్తు గురువారం ఉదయం 11 గంటలకు తేలనుంది. ముఖ్యమంత్రిగా హెచ్ డీ కుమారస్వామి కొనసాగుతాడా? దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో వేచి చూడాలి. అయితే రెండురోజులు వ్యవధి ఉండటంతో ఇరుపక్షాల నేతలు బల నిరూపణపై ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. అసమ్మతి నేతలను బుజ్జగించి మద్దతు నిరూపించుకోవాలని కాంగ్రెస్ – జేడీఎస్ నేతలు భావిస్తుండగా.. ప్రతిపక్షంలోని బీజేపీ నేతలు కూడా అవిశ్వాసంలో నెగ్గుతామని ధీమాగా ఉన్నారు. కాగా అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించే తీర్పుపై మూడు పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు.
ఈనెల 12వ తేదీన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కుమారస్వామి కాంగ్రెస్ – జేడీఎస్ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో గందరగోళం నెలకొంది. ఈక్రమంలో సభలో బల నిరూపణకు తాము సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు. ఫలితంగా ప్రతిపక్ష నేత బీఎస్ యడ్డూరప్ప అప్రమత్తమై ‘ఆపరేషన్ రివర్స్’ భయంతో బీజేపీ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించారు. శని, ఆదివారం సెలవు రావడంతో సోమవారం రిసార్టుల నుంచి నేరుగా విధానసౌధకు వచ్చారు. ఆరంభం నుంచి అవిశ్వాస తీర్మాంనపై బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. ఈక్రమంలో స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ వచ్చే గురువారం ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారు చేశారు. సీఎం కుమారస్వామితో పాటు డిప్యూటీ సీఎం పరమేశ్వర్, మాజీ సీఎం సిద్ధరామయ్య, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్డూరప్ప కూడా ఆ సమయంలో సభలో ఉన్నారు.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం సభలో 10 రోజులు ముందుగానే అవిశ్వాస తీర్మానం గురించి చర్చకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం మూడు రోజుల వ్యవధిలోనే అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. అయితే అసెంబ్లీ సమావేశాలు కూడా గురువారం వరకు వాయిదా వేయాలన్న బీజేపీ సభ్యుల ఒత్తిడితో స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ రెండురోజుల వాయిదా వేశారు. అనంతరం ఎమ్మెల్యేలను రిసార్టు, హోటళ్లకు తీసుకెళ్లారు. సమావేశాల నేపథ్యంలో విధానసౌధ చుట్టుపక్కల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ – జేడీఎస్ నుంచి ఇప్పటి వరకు 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అందరి రాజీనామాలో ఆమోదిస్తే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. బీజేపీ సొంత బలంతోనే అధికారంలోకి వస్తుంది. మొత్తం 224 మంది సభ్యులు ఉండే కర్ణాటకలో బీజేపీ 105 ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు స్వతంత్య్ర సభ్యుల మద్దతు కూడా కలిగి ఉంది. అయితే కాంగ్రెస్ 79, జేడీఎస్ 37, బీఎస్పీ 1 తో కలిపి మొత్తం 117 సభ్యులను కలిగి ఉన్న సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతం 16 మందిని కోల్పోయింది. ఈక్రమంలో కుమారస్వామి ప్రభుత్వం కేవలం 101 మంది ఎమ్మెల్యేలను మాత్రమే కలిగి ఉంది.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన 16 మందిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ – జేడీఎస్ సభ్యులు స్పీకర్ కేఆర్ రమేశ్‌కుమార్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈమేరకు అసంతృప్త ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, హెచ్.విశ్వనాథ్, గోపాలయ్య, నారాయణేగౌడ, ఎస్‌టీ సోమశేఖర్, భైరతి బసవరాజు, మునిరత్న, బీసీ పాటిల్, రమేశ్ జార్కిహోళి, రోషన్‌గౌడ, ప్రతాప్ గౌడ పాటిల్, శివరాం హెబ్బార్, ఎంటీబీ నాగరాజు, ఆనందసింగ్, కె.సుధాకర్, మహేశ్ కుమటళ్లిపై అనర్హత వేటు వేయాలని సీఎం కుమారస్వామి, మాజీ సీఎం సిద్ధరామయ్య, మంత్రులు డీకే శివకుమార్, సా.రా.మహేశ్, ఎంబీ పాటిల్, కేపీసీసీ చీఫ్ దినేశ్ గుండూరావు తదితరులు వెళ్లి స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం కుమారస్వామి సూచించారు. ఎమ్మెల్యేలు అందరు ఒకేతాటిపైకి వస్తే ప్రభుత్వం మనుగడ సాధ్యమన్నారు.