Begin typing your search above and press return to search.

కర్ణాటక హిజాబ్ ఆందోళన సుప్రీంకు: ఎలాంటి ఆదేశాలంటే..?

By:  Tupaki Desk   |   11 Feb 2022 9:30 AM GMT
కర్ణాటక హిజాబ్ ఆందోళన సుప్రీంకు: ఎలాంటి ఆదేశాలంటే..?
X
కర్ణాటక రాష్ట్రంలో తలెత్తన ‘హిజాబ్’ వ్యవహారం దేశ వ్యాప్తంగా హీటెక్కింది. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారంలో కీలక తీర్పు వెలువడే వరకు సంయమనం పాటించాలని, అంతవరకు మతపరమైన దుస్తులు ధరించకుండా విద్యాసంస్థలకు వెళ్లాలని సూచించింది.కానీ కొందరు ముస్లిం విద్యార్థులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడా విచారణ జరిపిన కోర్టు ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇది జాతీయసమస్య కాదని అవసరమైనప్పుడు స్పందిస్తామని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ రమణ తెలిపారు.

‘హిజాబ్’ మా హక్కు అంటూ ముస్లిం విద్యార్థినులు చేసిన ఆందోళన ఉధృతంగా మారింది. వారికి పోటీగా హిందూ మతానికి చెందిన విద్యార్థినులు కాషాయ కండువాలు ధరించి విద్యాసంస్థలకు హాజరయ్యారు. దీంతో విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తులు ధరించడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే హిజాబ్ ధరించడం మా హక్కు అంటూ ముస్లిం విద్యార్థినులు మరింత ఆందోళన నిర్వహించారు. దీంతో వీరికి రాజకీయ పార్టీలు, మరికొందరు అండగా నిలవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. రాష్ట్రంలోని ఉడుపు, మండ్య తో పాటు పలు జిల్లాలో తీవ్ర ఆందోళనలు జరిగాయి.

ఈ వ్యవహారంపై హైకోర్టు సత్వరమే స్పందించింది. కొందరు వేసిన పిటిషన్ ను స్వీకిరించిన సింగిల్ బెంచ్ అత్యవసర పరిస్థితిని గమనించి ఫుల్ బెంచ్ కి మార్చింది.అయితే ‘హిజాబ్’ విషయంలో న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. అయితే ముస్లిం విద్యార్థుల తరుపున లాయర్ ఆహారం.. నీరు రెండింటిలో ఏది కావాలంటే ఎలా.. రెండూ అవసరమే అని వాదించారు.

ఈ మధ్యంతర ఉత్తర్వులు హక్కులను రద్దు చేసినట్లే అవుతుందని అన్నారు. అయితే ఇందుకు చీఫ్ జస్టిస్ స్పందిస్తూ ఇవి కొన్ని రోజుల వరకేనని అప్పటి వరకు సహకరించాలని తెలిపారు. కేసు వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని మతాల వారికి ఆదేశాలు వర్తించేలా ఉంటాయని తెలిపారు.

ఇదిలా ఉండగా కొందరు ముస్లిం విద్యార్థులతో పాటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ కపిల్ సిబర్ హిజాబ్ వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సుప్రీం స్వీకరించి విచారణ చేసింది.

అయితే కర్నాటక హైకోర్టు నుంచి ఈ కేసును సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కపిల్ సిబల్ కోరారు. కానీ హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ రమణ తెలిపారు.