Begin typing your search above and press return to search.

ఆస్తిలో కుమార్తె వాటాపై కర్ణాటక హైకోర్టు సంచలనం

By:  Tupaki Desk   |   27 Feb 2022 4:28 AM GMT
ఆస్తిలో కుమార్తె వాటాపై కర్ణాటక హైకోర్టు సంచలనం
X
కీలక తీర్పును ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. ఆస్తిలో కుమార్తె వాటా విషయంపై కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసేలా ఉందన్న మాట వినిపిస్తోంది. ఆస్తిలో కుమార్తె వాటా కోరిన పక్షంలో.. పెళ్లి నాడు ఆమెకు ఇచ్చిన వరకట్నాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలని కీలక ఆదేశాల్ని ఇచ్చింది.

బెంగళూరుకు చెందిన ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు కీలక తీర్పును ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ.. పెళ్లి తర్వాత కుమార్తె తన తండ్రి.. తల్లి ఆస్తిలో వాటా కోరిన పక్షంలో.. ఆమె పెళ్లి వేళ.. ఆమెకు ఇచ్చిన కట్నకానులను కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. అవిభక్త కుటుంబంలో ఆస్తిలో వాటాను కుమార్తె కోరిన పక్షంలో మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది.

దీని ప్రకారం కుమార్తె తన తల్లిదండ్రుల ఆస్తిలో మిగిలిన వారితో పోటీ పడినప్పుడు.. ఆమెకు పెళ్లి వేళలో ఇచ్చిన వరకట్నంతో పాటు.. కానుకలను కూడా పరిగణలోకి తీసుకొని.. వాటాను డిసైడ్ చేయాలంటున్నారు.

ఒక విధంగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొడుకైనా..కుమార్తె అయినా తల్లిదండ్రుల ఆస్తుల్ని పంచుకునే పరిస్థితిలో వివాదం ఏర్పాటైతే.. ఈ విధానాన్ని అనుసరించాలన్న కోర్టు తీర్పు.. చాలా మందికి ఉండే సమస్యలకు పరిష్కారంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.