Begin typing your search above and press return to search.

గౌరీ ఘ‌ట‌న‌తో... క‌లానికి భ‌ద్ర‌త‌!

By:  Tupaki Desk   |   10 Sep 2017 9:52 AM GMT
గౌరీ ఘ‌ట‌న‌తో... క‌లానికి భ‌ద్ర‌త‌!
X
దేశంలో జ‌ర్న‌లిస్టులు ఎప్ప‌టి నుంచో ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉన్నారు. అటు ప్ర‌భుత్వాల నుంచి ఇటు రాజ‌కీయ నేత‌ల నుంచి కూడా వారికి ప్ర‌త్యక్ష దాడులు ఎప్పుడూ త‌ప్ప‌లేదు. అయితే - అనూహ్య ప‌రిణామంగా హ‌త్య‌ల‌కు దారితీయ‌డం - అదికూడా పాయింట్ బ్లాంక్‌ లో తుపాకీ కాల్పుల‌కు పాల్ప‌డ‌డం వంటి ఘ‌ట‌న‌లే ఇప్పుడు ప్ర‌జాస్వామ్య భార‌తికి క‌న్నీళ్లు తెప్పిస్తున్నాయి. బెంగ‌ళూరులో రెండు రోజుల కింద జ‌రిగిన ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు - అభ్యుద‌య వాది గౌరీ లంకేష్ దారుణ హ‌త్య దేశం స‌హా ప్రజాస్వామ్య దేశాల‌ను సైతం కంపించింది. ప్ర‌తి ఒక్క‌రూ నిర్ఘాంత పోయారు.

క‌లానికి జ‌రుగుతున్న దారుణాల‌పై ఎలుగెత్తారు. ఈ క్ర‌మంలోనే క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం స‌హా భార‌త ప్ర‌భుత్వాలు స్పందించాయి. దేశ వ్యాప్తంగా అభ్యుద‌య ర‌చ‌యిత‌లు - జ‌ర్న‌లిస్టుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని డిసైడ్ అయ్యాయి. ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో స్థానిక భావ‌జాలాన్ని ఒంట బ‌ట్టించుకుని రెచ్చిపోతున్న క‌ర్ణాట‌క‌లో ర‌చ‌యిత‌ల‌కు - జ‌ర్న‌లిస్టుల‌కు భీతి వీడ‌డం లేదు. దీంతో కర్ణాటకలోని అభ్యుదయ వాదులు - రచయితలు - మేధావులకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో వారికి పోలీసు రక్షణ కల్పిస్తుట్లు ప్రభుత్వం ప్రకటించింది.

గౌరీ లంకేష్‌ హత్య తరువాత ఒక వర్గం నుంచి పలువురికి బెదిరింపులు వస్తుండండంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్ర‌మంలోనే 25 మంది రచయితలు - అభ్యుదయ వాదులకు పోలీసు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం అధికాలను ఆదేశించారు. హిందుత్వ శక్తుల నుంచి హాని కలిగే అవకాశం ఉన్న గిరీస్‌ కర్నాడ్‌ - బార్గుర్‌ రమాచంద్రప్ప - కేఎస్‌ భగవాన్‌ - యోగేష్‌ మాస్టర్‌ - బెనర్జీ జయప్రకాష్‌ - చెన్నవీర కన్నావి - నటరాజ్‌ హులియార్‌ - చంద్రశేఖర్‌ తదితరులకు పోలసుల రక్షణ కల్పిం‍చారు. ప్రత్యేక లింగాయత్‌ కమ్యూనిటీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మాజీ ఐఏఎస్‌ ఎస్‌ ఎమ్‌ జమ్దార్‌ కు ప్రత్యేక రక్షణ కల్పించాలని ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి గౌరీ హ‌త్య జ‌రిగితేనే త‌ప్ప ప్ర‌భుత్వాల్లో క‌ద‌లిక రాక‌పోవ‌డం దుర్మార్గం!!