Begin typing your search above and press return to search.
తమిళనాడులో ముత్తూట్ లో కర్ణాటక గ్యాంగ్ గోల్డ్ చోరీ .. పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు !
By: Tupaki Desk | 23 Jan 2021 7:33 AM GMTదొంగలు రోజురోజుకి దేశంలో రెచ్చిపోతున్నారు. తమిళనాడులోని హోసూరులో గల ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో బంగారం చోరీ చేసిన కర్ణాటక దొంగల ముఠా హైదరాబాద్ లో పట్టుబడింది. సైబరాబాద్ పోలీసులు ఈ దొంగల ముఠా సభ్యులను శనివారం నాడు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం దొంగతనం చేయగా , ఈ రోజు తెల్లవారు జామున ఆ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని హోసూరులో శుక్రవారం ఉదయం భారీ దోపిడీ జరిగింది. హోసూరు, బాగలూరు రోడ్డులో ఉన్న ముత్తూట్ కార్యాలయం తెరుచుకున్న కొద్ది సేపటికే దోపిడీ దొంగలు చొరబడ్డారు. కార్యాలయంలోని సిబ్బందిని బెదిరించి.. భారీ మొత్తంలో బంగారం, నగదు అపహరించుకుపోయారు. దాదాపు 25 కిలోలకు పైగా బంగారం, లాకర్లలో ఉన్న రూ. 96వేల నగదు కూడా దోచుకెళ్లినట్లు ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన బంగారం విలువ సుమారు రూ.7.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.