మాజీ ప్రధాని దేవెగౌడ కొడుకు గన్ మెన్లకు కరోనా సోకింది. కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ ఆరుగురు గన్ మెన్లలో నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యినట్లు తెలిసింది. రేవణ్ణ వ్యక్తిగత సిబ్బంది కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చినట్టు తెలిసింది.
గన్ మెన్లకు పాజిటివ్ రావడంతో హెచ్.డీ. రేవణ్ణను కూడా ఇవాళ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. దీంతో ఆయన చేయించుకోవడానికి రెడీ అయ్యారు.
ప్రస్తుతం హసన్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రేవణ్ణ బెంగళూరులోని ఆయన నివాసంలో ఉన్నారు. ఆయన గన్ మెన్లకు కరోనా వచ్చిందన్న వార్తపై ప్రస్తుతానికి ఆయన స్పందించలేదు.