Begin typing your search above and press return to search.

కన్నడ సంకీర్ణం: ఈ సాయంత్రం డెడ్ లైన్..

By:  Tupaki Desk   |   23 July 2019 5:43 AM GMT
కన్నడ సంకీర్ణం: ఈ సాయంత్రం డెడ్ లైన్..
X
కన్నడ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. కొద్దిరోజులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు మైనార్టీలో పడిపోయింది. విశ్వాస పరీక్ష చేస్తే ప్రభుత్వం కూలిపోతుంది. చేయాలని బీజేపీ.. చేయకుండా జేడీఎస్-కాంగ్రెస్ అసెంబ్లీలో గేమ్ ఆడుతుండడంతో దేశవ్యాప్తంగా కర్ణాటక సర్కారు మనగుడపై ఉత్కంఠ నెలకొంది.

కాగా సోమవారం అర్ధరాత్రి వరకు అసెంబ్లీ జరిగింది. విశ్వాస పరీక్ష ఉంటుందని స్పీకర్ సురేష్ కుమార్ ప్రకటన చేయడంతో ఉత్కంఠ నెలకొంది. సోమవారమే విశ్వాస పరీక్ష జరుపుతారని అంతా ఆశించినా గందరగోళం మధ్య సాధ్యపడలేదు. మంగళవారం విశ్వాస పరీక్ష జరిగే అవకాశం ఉంది. అయితే సీఎం కుమారస్వామి మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. మాట వినకపోతే రాజీనామా చేస్తానని స్పీకర్ సురేష్ బెదిరిస్తున్నారు..

ఇక స్పీకర్ సురేష్ పై అటు గవర్నర్ నుంచి.. ఇటు బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. సుప్రీం కోర్టు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని దిశానిర్ధేశం చేసింది. దీంతో మంగళవారం సభలో విశ్వాస పరీక్ష నిర్వహించి ఏదో ఒకటి తేల్చాలని స్పీకర్ నిర్ణయించినట్టు సమాచారం.

అయితే ఓటింగ్ జరిగితే కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్న అంచనాలున్నాయి. ఇప్పటికే 20 మంది వరకు కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. వారంతా ఓటేయకపోతే సర్కారు పడిపోతుంది. బీజేపీకి ప్రస్తుతం 107 మంది సభ్యుల బలం ఉండగా.. కాంగ్రెస్ -జేడీఎస్ లకు 102 మంది మాత్రమే ఉన్నారు. మేజిక్ ఫిగర్ 105గా ఉన్నట్టు తెలుస్తోంది.. దీంతో ప్రభుత్వం పడిపోవడం ఖాయమంటున్నారు.