Begin typing your search above and press return to search.

పవన్ తో కర్ణాటక మాజీ సీఎం భేటీ అందుకేనట

By:  Tupaki Desk   |   20 Aug 2016 7:37 AM GMT
పవన్ తో కర్ణాటక మాజీ సీఎం భేటీ అందుకేనట
X
అవసరానికి మాత్రమే బయటకు వచ్చే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన పార్టీని స్టార్ట్ చేసినా.. దాన్ని పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మాత్రం ఆయన మార్చలేదు. అప్పుడప్పుడు జనసేన పార్టీ గురించి మాట్లాడే పవన్.. పార్టీని పూర్తిస్థాయిలో రాజకీయపార్టీగా మార్చేందుకు తనకున్న పరిమితులు.. అడ్డంకుల్ని కాస్త ఓపెన్ గానే చెప్పేస్తుంటారు. గడిచిన కొద్దికాలంగా మౌనంగా ఉంటున్న ఆయన.. అనుకోనిది ఏదైనా జరిగే వెంటనే మాత్రం రియాక్ట్ అవుతున్నారు.

మొన్నా మధ్య ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో ప్రాణ త్యాగం చేసుకున్న చేసుకున్న మునికోటికి సాయం అందించే విషయంలో ఏపీ సర్కారు.. కాంగ్రెస్ పార్టీ విఫలమైందంటూ వార్తలు రావటం తెలిసిందే. అతని మరణించిన వేళ.. అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు ఏపీ సర్కారు.. కాంగ్రెస్ పార్టీలు రెండూసాయాన్ని ప్రకటించిన ఏడాది అయినా తమ మాటను నిలబెట్టుకోలేదంటూ వార్తల నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించారు. గుట్టుచప్పుడు కాకుండా.. ఎలాంటి ప్రకటన చేయకుండానే తన ప్రతినిధుల చేత మునికోటి కుటుంబాన్ని కలిసి.. వారికి ఆర్థిక సాయాన్ని అందించటం ద్వారా.. జరుగుతున్న ప్రతివిషయం మీదా తాను కన్నేసిన విషయాన్ని తన చేతలతో చెప్పకనే చెప్పేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ఆయన.. పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. వీరి భేటీ ఏ అంశం మీదన్న ఆసక్తి అందరిలో ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా పవన్ తో భేటీ అయిన కుమారస్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ మధ్య స్నేహం చాలా కాలం నుంచి ఉందని.. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి చిత్రం విడుదల సందర్భంగా అశీర్వాదం కోసమే పవన్ ను కలిసినట్లుగా ఆయన చెప్పారు. ఏపీ.. తెలంగాణ.. కర్ణాటక రాష్ట్రాలుఅన్నదమ్ముల మాదిరివిగా ఆయన చెప్పారు. కుమారస్వామితో పాటు మాట్లాడిన పవన్ కల్యాణ్..