Begin typing your search above and press return to search.

కర్నాటక ఎన్నికల్లో రెడ్డి విజయం

By:  Tupaki Desk   |   13 May 2023 9:06 PM GMT
కర్నాటక ఎన్నికల్లో రెడ్డి విజయం
X
కర్నాటక కూడా 1956లో భాషా ప్రయుక్త ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం. కొంత భాగం రాయలసీమ, మరికొంత భాగం ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి వెళ్ళి కర్నాటకలో కలిశాయి. అలా కనుక చూస్తే కర్నాటకలో తెలుగు మూలాలు తెలుగు రాజకీయాలు ఇప్పటికి దాదాపుగా ఏడు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. పార్టీలకు అతీతంగా కీలక సామాజిక తెలుగు వర్గాలు అక్కడ కూడా సత్తా చాటుకుంటూ వస్తున్నారు.

గతంలో కాంగ్రెస్, బీజేపీ జేడీఎస్. ఇలా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా పదవులు అందుకుంటూ వస్తున్నారు. అదే ట్రెండ్ ఈసారి కూడా కొనసాగుతూ వచ్చింది. అయితే ఈసారి ఎన్నికలో కూడా తెలుగు మూలాలు ఉన్న వారు పన్నెండు మంది ఎమ్మెల్యేలుగా నెగ్గారు. వీరిలో రాజకీయాల్లో ప్రధానంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏకంగా తొమ్మిది మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం విశేషంగా చెబుతున్నారు.

ఇలా వీరంతా కొత్త అసెంబ్లీలో వారు కనిపిస్తారన్న మాట. వారు ఎవరు అన్నది కనుక చూస్తే హైద‌రాబాద్ క‌ర్ణాట‌క‌, మ‌ద్రాస్ స్టేట్ నుంచి క‌ర్ణాట‌క‌లో క‌లిసిన తెలుగు ప్రాంతం నుంచి వీరంతా గెలిచారు. అలాగే సెటిలర్లు తెలుగు వారు ఎక్కువగా ఉండే బెంగుళూరు సిటీతో పాటు బళ్లారీ నుంచి కూడా తెలుగు వారు గెలిచారు.

వీటిలో బెంగుళూరు సిటీ నుంచి చూస్తే కనుక బీటీఎం లే అవుట్ అన్న ప్రాంతం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి రామలింగారెడ్డి మరోసారి గెలిచారు. ఈయన నేపధ్యం అంతా బళ్లారి నుంచి బెంగుళూరు సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీగా ఉంది. ఈయన ఉన్న నియోజకవర్గం బెంగుళూరు నడిబొడ్డున ఉండడం విశేషం.

ఈయన చాలా సార్లు ఇక్కడ నుంచి గెలిచి సత్తా చాటుకుంటున్నారు. ఈయన కుమార్తె సౌమ్యారెడ్డి అయితే జయనగర నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు. అలాగే బీటీఎం లే అవుట్ కి పక్కన ఉన్న మరో నియోజకవర్గంగా బొమ్మనహళ్ళీని చెబుతారు. అక్కడ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన సతీష్ రెడ్డి గెలిచారు.

ఇక తెలుగు నాట నుంచి వచి సెటిల్ అయిన వరు వలసలు వచ్చిన వారు ఎక్కువగా ఉండే యలహంక నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున విశ్వనాధ నెగ్గారు. ఈయనది కూడా తెలుగు రెడ్డి కుటుంబం గా చెబుతున్నారు. బళ్లారీ అంటేనే తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతంగా చెబుతారు. ఇక్కడ ఈసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా భరత్ రెడ్డి గెలిచారు. అలాగే గంగావతి నుంచి గాలి జనార్ధనరెడ్డి గెలిచారు.

ఇక జేడీఎస్ తరఫున కూడా తెలుగు వాడైన వెంకట శివారెడ్డి శ్రీనివసనగర నుంచి గెలిచారు. ఇదే సీటు నుంచి పోటీ పడిన సీనియర్ నేత, మాజీ స్పీకర్ రమేష్ కుమార్ ని ఈయన ఓడించారు. ఈయనది కూడా తెలుగు కుటుంబ నపధ్యం. బాగేపల్లి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బారెడ్డి మళ్లీ గెలవడం కూడా తెలుగు వారి హవాను చాటి చెబుతోంది.

ఇలా లిస్ట్ చూస్తే పన్నెండు మంది దాకా తెలుగు మూలాలు ఉన్న వారు కొత్త అసెంబ్లీలో కనిపిస్తారు అన్న మాట. వీరంతా కొత్త శాసనసభలో ప్రజా సమస్యల మీద చర్చించనున్నారు. వీరిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువగా ఈసారి గెలవడం విశేషం. ఇప్పటికే ఏపీ తెలంగాణాలో రెడ్డి ప్రతినిధులు ఉన్నారు. ఇపుడు కన్నడ నాట కూడా గుడ్ నంబర్ తో అసెంబ్లీలో కనిపించబోతున్నారు