Begin typing your search above and press return to search.
పార్టీలను టెన్షన్ పెడుతున్న కర్ణాటక ఎన్నికలు..రీజన్ ఇదే
By: Tupaki Desk | 28 April 2023 8:00 AM GMTసాధారణంగా ఎన్నికలు అనగానే పార్టీలకు.. అంతకుమించి అభ్యర్థులకు కూడా టెన్షన్ ఉంటుంది. ఎంతో ఖర్చు పెట్టుకుని బరిలో దిగాం.. ఓడతామా.. గెలుస్తామా.. అని అభ్యర్థులు.. అధికారం దక్కేనా లేదా? అని పార్టీలు ఎన్నికల ఫలితం వచ్చేవరకు కూడా.. టెన్షన్‌గానే అడుగులు వేస్తుంటాయి. అయితే.. కర్ణాటకలో ఇప్పుడు మరో టెన్షన్ వచ్చి పడింది. మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ ఎంతో ఆశలు పెట్టుకున్నాయి.
అయితే, నిన్న మొన్నటి వరకు కూడా.. బీజేపీ సెకండ్ ప్లేస్.. కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ అంటూ.. కొన్ని సర్వే లు వచ్చాయి. ఈసారి కర్ణాటకలో పూర్తిస్థాయి మెజారిటీతో పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతుందని కూడా చెప్పాయి. దీంతో సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఆనందం వెల్లివిరిసింది.
అయితే.. ఎన్నికలకు రోజులు సమీపిస్తున్న కొద్దీ ప్రజానాడి మారుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా కొన్ని స్థానిక మీడియా సంస్థలు చేపట్టిన సర్వేలో ఏ పార్టీ కూడా ఏకపక్షంగా అధికారం చేజిక్కించుకునే పరిస్థితి లేదని స్పష్టమైంది.
కర్ణాటకలో హంగ్ ఏర్పడుతుందని ఈ సర్వేలు తేల్చి చెప్పాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో తీవ్ర కలవరం మొదలైంది. అదేసమయంలో ప్రాంతీయ పార్టీ జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉందని స్పష్టం చేశాయి.
అంటే.. తక్కువ సీట్లే దక్కించుకున్న జేడీఎస్ మరోసారి చక్రం తిప్పే అవకాశం ఉంటుదన్న మాట. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటకలో అధికారం చేపట్టేందుకు మేజిక్ ఫిగర్ 113 సీట్లు కావాలి. ఇక, తాజాగా వివిధ సంస్థలసర్వేలు ఇవీ..
సంస్థ బీజేపీకి సీట్లు కాంగ్రెస్ జేడీఎస్
+ ది ఏషియానెట్-సువర్ణ న్యూస్ జన్‌కీ బాత్ 98-109 89-97 28-99
+ ది న్యూస్‌ఫస్ట్ -మాట్రిజ్ 96-106 84-94 29-34
+ టీవీ9-సీ ఓటర్ 79-89 106-116 24-34
+ విస్తారా న్యూస్-సౌత్ ఫస్ట్ పీపుల్స్ పల్స్ 88 -93 84-90 23-26
+ ది సౌత్ ఫస్ట్ 90-100 95-105 25-30