Begin typing your search above and press return to search.
కర్ణాటక ఎలక్షన్స్.. ఆ మూడు ప్రాంతాలే కీలకం
By: Tupaki Desk | 29 March 2023 9:06 PM GMTకర్ణాటక ఎన్నికలకు రంగం రెడీ అయింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే.. రాష్ట్రం మొత్తం పరిస్థితి ఎలా ఉన్నా.. సరిహద్దు రాష్ట్రాలతో ఉన్న జిల్లాల్లో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది.
తెలుగు వారు అధికంగా ఉండే హైదరాబాద్ కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఉండే.. ముంబై కర్ణాటక, తమిళ ప్రజలు ఎక్కువగా ఉన్న ఓల్డ్ మైసూర్ ప్రాంతాల్లో బీజేపీ పరిస్థితి ఎదురు గాలిని ఎదుర్కొంటోంది. ఎందుకంటే.. ఈ మూడు సరిహద్దుల్లోనూ బీజేపీని వ్యతిరేకిస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు.
తమిళనాడు అధికార పార్టీ, తెలంగాణ అధికార పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ముంబై ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సరిహద్దు వివాదాలు.. ఇక్కడి ప్రజలను బీజేపీకి దూరం చేశాయి.
దీంతో ఈ మూడు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌కు 43.7% ఓట్లు దక్కనున్నట్టు అంచనా. ఇక్కడ ఆ పార్టీకి 19-23 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. ముంబయి కర్ణాటక, ఓల్డ్ మైసూర్‌లోనూ కాంగ్రెస్‌కే మొగ్గు ఎక్కువగా ఉంది. సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్‌కు 41.2%, బీజేపీకి 37.7%, జేడీఎస్‌కు 13.1% ఓట్లు దక్కే అవకాశమున్నట్టు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది.
ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 18-22 సీట్లు, బీజేపీకి 12-16, జేడీఎస్‌కు ఒక స్థానం దక్కనున్నట్టు అంచనా. ఇక కోస్టల్ కర్ణాటకలో కాంగ్రెస్‌కు 41.2% ఓట్లు, 8-12 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఇదే ప్రాంతంలో బీజేపీకి 46.2% ఓట్లు, 9-13 సీట్లు రానున్నట్టు తేలింది.
అత్యంత కీలకమైన గ్రేటర్ బెంగళూరులోనూ...కాంగ్రెస్‌దే పైచేయిగా ఉండనున్నట్టు అంచనా. ఇక్కడ కాంగ్రెస్‌కు 38.6% ఓట్లు, 15-19 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక బీజేపీ విషయానికొస్తే...36.8% ఓట్లు, 11-15 సీట్లు దక్కనున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.