Begin typing your search above and press return to search.
నా భార్యకు టికెట్ ఇవ్వకపోతే మీ టికెట్ నాకొద్దు: మాజీ ప్రధానికి కుమారుడి షాక్!
By: Tupaki Desk | 10 April 2023 1:10 PM GMTకర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే నెలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఇప్పటిదాకా వెలువడిన సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కుతుందని తేల్చాయి. పనిలో పనిగా కర్ణాటక ఆత్మగౌరవం పేరుతో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (జేడీఎస్) కూడా పావులు కదుపుతోంది. ఈసారి ఒంటరిగా అధికారంలోకి రావాలని పెద్ద లక్ష్యాన్నే నిర్దేశించుకుంది.
అయితే ఇంటిపోరే జేడీఎస్ కు ప్రతికూలంగా మారిందని అంటున్నారు. ఇప్పటికే కుటుంబ పార్టీగా జేడీఎస్ ముద్ర పడిందని గుర్తు చేస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి దేవగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ, చిన్న కుమారుడు కుమారస్వామి, రేవణ్ణ కుమారుడు, కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఇలా ఆ పార్టీ తరఫున కుటుంబ సభ్యులంతా ఎన్నికల బరిలో ఉన్నారు.
ఈ క్రమంలో తనకు టికెట్ ఇవ్వాలని.. జేడీఎస్ కంచుకోట అయిన హసన్ నుంచి పోటీ చేస్తానని దేవగౌడ కోడలు, రేవణ్ణ భార్య భవానీ కోరుతున్నారు. ఈ సీటును ఇప్పటికే పార్టీ కార్యకర్త లక్ష్మణ్ ను కేటాయించానని కుమారస్వామి చెబుతున్నారు. తన భార్య అనిత కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ఆమె గతంలో పోటీ చేసిన సీటును త్యాగం చేసిందని.. ఆ సీటులో తన కుమారుడు నిఖిల్ పోటీ చేస్తున్నారని కుమారస్వామి చెబుతున్నారు. తాను, తన కుమారుడు, రేవణ్ణ, ఆయన కుమారుడు పోటీ చేస్తుండటంతో లెక్క సరిపోయిందని అంటున్నారు. ఇక తన భార్య, తన అన్న భార్య భవానీలకు సీట్లు లేవని పేర్కొంటున్నారు.
అయితే కుమారస్వామి అన్న, దేవగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ మాత్రం తన భార్యకు టికెట్ విషయంలో పట్టు విడవడం లేదు. తన భార్య భవానీకి టికెట్ ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. తన భార్యకు టికెట్ ఇవ్వకపోతే తాను హోళనరసీపుర నుంచి పోటీ చేయబోనని తేల్చిచెబుతున్నారు. అంతేకాకుండా తన భార్య భవానీ హసన్ నుంచి, తాను హోళనరసీపుర నుంచి ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతామని తన తండ్రికి, తన సోదరుడుకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఈ క్రమంలో జేడీఎస్ కార్యకర్తలతో రేవణ్ణ, ఆయన భార్య భవానీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమకిద్దరికి సీట్లు ఇవ్వకపోతే ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని, తమకు మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలను, కార్యకర్తలను కోరుతున్నారట.
ఈ మేరకు ఒక ఆంగ్ల పత్రిక సంచలన కథనం ప్రచురించింది. అసెంబీ టికెట్ల కోసం దేవగౌడ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయని పేర్కొంది. దీంతో ఎన్నికల ముందు జరుగుతున్న పరిణామాలతో దేవగౌడ, కుమారస్వామి తలలు పట్టుకున్నారని తన కథనంలో వెల్లడించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.