Begin typing your search above and press return to search.

ఐటీ కంపెనీలు ఇప్పట్లో లేనట్టే .. స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి !

By:  Tupaki Desk   |   11 Dec 2020 1:30 PM GMT
ఐటీ కంపెనీలు ఇప్పట్లో లేనట్టే .. స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి !
X
ఐటీ, బీటీ, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారిని తక్షణం వారివారి కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించాలని చెప్పలేమని, అలా చెప్పడం సాధ్యంకాదని ఉప ముఖ్యమంత్రి అన్నారు. కరోనా వైరస్ వ్యాధి ఇంకా తగ్గలేదని , ఆ వైరస్ మహమ్మారికి విరుగుడుకు పరిష్కారం టీకా అందుబాటులోకి వచ్చిన తరువాత ఐటీ కంపెనీలు ప్రారంభించాలని సూచిస్తామని, అంత వరకు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంచిదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ క్లారిటీ ఇచ్చారు.

కరోనా మమహ్మరి దెబ్బతో 2020 మార్చి చివరి వారం నుంచి ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ తో వారివారి ఇళ్లకు, సొంత ప్రాంతాలకు పరిమితం అయ్యారు. అప్పుడు మూతపడిన ఐటీ కంపెనీలు ప్రస్తుతం చాలా తక్కువ శాతం మంది ఉద్యోగులతో మాత్రమే వారి కార్యలాయాల్లో పనులు చేయిస్తున్నారు. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో చాలా ఐటీ కంపెనీలు ఇంత వరకు ప్రారంభం కాలేదని, వాటి పరిణామం చిరు వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్ల మీద పడుతోందని, అందు వలన వెంటనే ఐటీ కంపెనీలను ప్రారంభించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పడే అవకాశం ఉందని, కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం ఏమిటో వెంటనే చెప్పాలని కర్ణాటకలోని బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే నియోజక వర్గం స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ విధాన సౌదలో కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు ప్రారంభం అయితే కరోనా వైరస్ వ్యాధి వ్యాపించక ముందు ఎలా ఉండేదో అలాగే పరిస్థితి ఉంటుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ గుర్తు చేశారు. ఐటీ కంపెనీలు ప్రారంభం అయితే ఆ ప్రాంతాల్లో ప్రజలు గుమికూడే అవకాశం ఉందని, ముందు పరిస్థితి ఎదురైతే కరోనా వైరస్ ఎక్కువ వ్యాపించే అవకాశం ఉందని, ఇలాంటి టైమ్ లో ఐటీ కంపెనీలు వెంటనే ప్రారంభించడం మంచిది కాదని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ విరుగుడుకు టీకాలు అందుబాటులోకి రావాలని, ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలని, తరువాత ఐటీ కంపెనీలు ప్రారంభించే విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని, అప్పుడు ఎప్పటిలాగే ఐటీ కంపెనీలు ప్రారంభం అవుతాయని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.