Begin typing your search above and press return to search.
సిద్ధూ సీఎం...చక్రం తిప్పేది డీకే...?
By: Tupaki Desk | 18 May 2023 2:06 PM GMTకర్నాటకలో ఎట్టకేలకు కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకుంది. ఈ నెల 20న కొత్త సీఎం గా సీనియర్ మోస్ట్ లీడర్ సిద్ధరామయ్య ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎం గా డీకే శివకుమార్ ని సెలెక్ట్ చేశారు. ఇక సిద్ధరామయ్య పదవీకాలం రెండేళ్ళు మాత్రమే ఉంటుంది. పైగా పక్కలో బల్లెంగా డీకే శివ కుమార్ ఉంటారు. ఆయనకు రెండు కీలకమైన శాఖలు ఇస్తారని ప్రచారం సాగుతోంది.
అంటే హోం శాఖ ఆర్ధిక శాఖలు ఆయనే చూస్తారా అన్న చర్చ వస్తోంది. అంతే కాదు, ఆయన మనుషులకు మరిన్ని కీలకమైన శాఖలు ఇస్తారు. అంటే రెవిన్యూ, ఎక్సైజ్, పంచాయతీ రాజ్ సహా ముఖ్యమైన శాఖలు డీకే వర్గానికి దక్కుతాయన్న మాట.
దీనికి తోడు అన్నట్లుగా పీసీసీ ప్రెసిడెంట్ గా డీకే కొనసాగబోతున్నారు. మామూలుగా ఎవరైనా మినిస్ట్రీలో చేరితే పార్టీ పదవిని వదిలేసుకోవాలి. జోడు పదవులు వద్దు అని కాంగ్రెస్ హై కమాండ్ ఒక సంప్రదాయాన్ని పెట్టింది. కానీ డీకే కోసం దాన్ని సవరించినట్లుగా ఉంది. అలా డీకే హవా చాలానే కనిపిస్తోంది
ఇక సిద్ధరామయ్య సీఎం గా ఉంటారు ఆయన వర్గం వారికి ఏమి పదవులు ఇస్తారో డీకే వర్గానికి ఇవ్వగా మిగిలినవి సర్దుకుంటారో చూడాలి. ఇక డీకే పేరుకు డిప్యూటీ కానీ అటు పార్టీ పెద్దగా ఇటు సగం కుర్చీ సీఎం గా సిద్ధరామయ్య మీద బాగానే తన ఆధిపత్యం చూపించే అవకాశాలు ఉన్నాయి.
అంటే సిద్ధరామయ్యను ఆయన సీనియారిటీని గౌరవించి అలా సీఎం సీట్లో కూర్చోబెట్టినా మొత్తం చక్రం తిప్పేది డీకే అని అర్ధం అయిపోతోంది. అది కూడా తొలి రెండేళ్ళు మాత్రమే సిద్ధ రామయ్య సీఎం. ఇక మిగిలిన మూడేళ్ళు డీకేకే సీఎం పోస్ట్. ఇక రెండేళ్ల పాటు పదవి నిర్వహించిన తరువాత సిద్ధరామయ్య ఇక రాజకీయాల నుంచి తప్పుకోవడమే అనాల్సి ఉంది. ఎందుకంటే ఆయన తనకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పుకున్నారు కాబట్టి.
అటు పార్టీ పూర్తిగా డీకే కంట్రోల్ లో ఉంటుంది. లోక్ సభ అభ్యర్ధుల ఎంపికలో కూడా డీకే మాట చెల్లుబాటు అయ్యేదే ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి సిద్ధరామయ్యకు కుర్చీ ఇచ్చినట్లే ఇచ్చి డీకేని పవర్ ఫుల్ గా చేసి పక్కన పెట్టారు. ఒక్క డీకే తప్ప డిప్యూటీ సీఎం మరొకరు లేకపోవడంతో డీకేయే అసలు సీఎం అన్న భావన కలిగినా కలగవచ్చు.
ఇప్పటిదాకా ప్రతిపక్షంలో ఇద్దరూ చేతులు కలిపి పనిచేశారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు దానిని పంచుకోవడం, ఆధిపత్యం విషయంలో ఒకరి మీద మరొకరు వ్యూహాలు రచించడం అన్నీ జరుగుతాయి. ఈ రోజుకు సిద్ధరామయ్య సీఎం గా ఉన్నా రేపటి రోజున నేనే అంటూ డీకే మొత్తం క్యాబినేట్ మీద పెత్తనం చేసినా చేయవచ్చు అంటున్నారు. ఏది ఏమైనా సిద్ధరామయ్య ఉత్సవ విగ్రహంగా ఉంటారా లేక జోరు పెంచి తన నిర్ణయాలనే ఫైనల్ చేయించుకుంటారా అన్నదే చూడాలి.
అదే జరిగితే మాత్రం కర్ణాటక కాంగ్రెస్ కత్తులు దూసే పర్వానికి తెర లేచినట్లే. ఏది ఏమైనా హై కమాండ్ పదవులు పంచినంత సులువు కాదు ప్రభుత్వాన్ని కలసి నడపడం అని అంటున్నారు. ఇక బీజేపీ ఎపుడు ఆపరేషన్ కమలం అంటూ ఎదురు చూస్తూనే ఉంటుంది. కాబట్టి కర్నాటకలో అయిదేళ్ళూ కాంగ్రెస్ జాగ్రత్తగా కధ నడుపుకోవాల్సి ఉంటుంది అన్నది మరవరాదు.