Begin typing your search above and press return to search.
జగన్ బాటలో కన్నడ సీఎం ...ఏంచేస్తున్నారంటే !
By: Tupaki Desk | 17 Feb 2020 11:15 AM GMTఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని , లేకపోతే మరోమారు తెలంగాణలాంటి ఉద్యమం తప్పదు అని భావించి అధికారంలోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీకి మూడు రాజధానులు అంటూ ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లు ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే ,మండలి లో ఈ బిల్లుని టీడీపీ అడ్డుకోవడంతో ..ప్రస్తుతానికి మూడు రాజధానుల వ్యవహారం పక్కన పెట్టినా కూడా మరో మూడు నెలల తరువాతైనా కూడా ఏపీకి మూడు రాజధానులు వస్తాయి అని ఏపీ ప్రభుత్వం చెప్తుంది.
ఆ తరువాత సీఎం జగన్ నిర్ణయాన్ని కాపీ కొడుతూ జార్ఖండ్ లో నాలుగు రాజధానులని ఏర్పాటు చేయడానికి ..ఆ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ తరుణంలో కర్ణాటక ప్రభుత్వం కూడా జగన్ విధానాన్ని మెచ్చి ..అభివృద్ధి వికేంద్రీకరణకు మొగ్గుచూపుతోంది. ఒకటి కాదు. రెండు కాదు.. వివిధ శాఖలకు చెందిన 10 కమిషనర్ కార్యాలయాలు, మండళ్లను బెంగళూరు నుంచి తరలించడానికి కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉత్తర కర్ణాటకలోని జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేయనుంది. దీనికోసం తాజాగా ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది యడియూరప్ప సర్కార్. ఏపీ , జార్ఖండ్ , సరసన తాజాగా బీజేపీ కూడా చేరడం తో అభివృద్ధి వికేంద్రీకరణకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంపాదించుకుంది.
ఇప్పటికే ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని బెళగావిలో సువర్ణ విధాన సౌధను నిర్మించింది. ఇక తాజాగా కమిషనర్ కార్యాలయాలను తరలించడానికి ఏర్పాట్లను చేపట్టింది. ఈ నిర్ణయం కొత్తది కాకపోయినా , రాజధాని బెంగళూరు నుంచి కొన్ని ప్రధాన శాఖలకు సంబంధించిన కమిషనర్ కార్యాలయాలను ఉత్తర కర్ణాటక జిల్లాలకు తరలించడానికి 2018 డిసెంబర్ లో అప్పటి హెచ్‌డీ కుమారస్వామి ప్రభుత్వం ఓ తీర్మానం చేసింది. ఆయన సారథ్యంలోని మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతి పాదనలపై ఆమోదం తెలియజేసింది. కానీ , ఆ తరువాత రాజకీయాల్లో భారీగా మార్పులు జరగడంతో ఈ విషయం మరుగున పడి పోయింది. ఇక ఈ నేపథ్యం లో తాజాగా యెడ్డీ సర్కార్ .. తాజాగా ఎంపిక చేసిన ఆ 10 కమిషనర్ కార్యాలయాలను తరలిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. కృష్ణా భాగ్య జల మండలి ఆలమట్టి లో ఏర్పాటు కానుంది. దావణగెరెలో కర్ణాటక నీరావరి మండలిని నెలకొల్పనున్నారు. జౌళి అభివృద్ధి మండలి, చక్కెర, చెరకు అభివృద్ధి కమిషనర్ కార్యాలయాలను బెళగావికి తరలించనున్నారు. ఆర్కియాలజీ, మ్యూజియం, పురావస్తు సంగ్రహణ డైరెక్టర్ కార్యాలయాన్ని చారిత్రాత్మక, ప్రముఖ పర్యాటక కేంద్రం హంపిలో ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటక పట్టణ మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలిని హుబ్బళ్లికి తరలించనున్నారు. ఈ మండలిని రెండుగా విభజించింది ప్రభుత్వం.అలాగే ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటకల కోసం ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేసింది. మానవ హక్కుల కమిషన్ కార్యాలయం, లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయాలు ధార్వాడలో ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయాన్ని కలబురికి తరలిస్తారు.