Begin typing your search above and press return to search.

ఆ 4 రాష్ట్రాల వారికీ అనుమతి లేదు ..సీఎం ప్రకటన !

By:  Tupaki Desk   |   18 May 2020 12:30 PM GMT
ఆ 4 రాష్ట్రాల వారికీ అనుమతి లేదు ..సీఎం ప్రకటన !
X
అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ .. విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి కర్ణాటక సర్కార్ లాక్ డౌన్ గైడ్ లైన్స్ విడుదల చేసింది. కర్ణాటకలో ప్రతీ ఆదివారం లాక్ ‌డౌన్‌ ను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని డిప్యూటీ సీఎం అశ్వథ్‌ నారాయణ్‌ తెలిపారు. ఆదివారాల్లో ఎటువంటి సడలింపులు ఉండవని.. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. అయితే రాష్ట్రాల మధ్య పరస్పర అనుమతితోనే ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

మంత్రులు, సీనియర్‌ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ఈ మేరకు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు.

అదే విధంగా మంగళవారం నుంచి పార్కులు తెరుచుకుంటాయని పేర్కొన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలోని షాపులు, మాల్స్‌, విద్యా సంస్థలు, జిమ్‌లు, స్విమ్మింగ పూల్‌, ఫిట్‌నెస్‌ సెంటర్లు తెరవబోమని తెలిపారు. ఇక, పాజిటివ్ కేసులు‌ ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కేరళ నుంచి వచ్చేవారికి మే 31 వరకు రాష్ట్రంలోకి అనుమతి లేదు అని తెలిపారు.

అయితే సామాజిక దూరం నిబంధనలు అనుసరించి బస్సులో కేవలం 30 మంది మాత్రమే ప్రయాణించే వెసలుబాటు కల్పించినట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రంలో ఓలా, ఉబెర్‌ కంపెనీలు మంగళవారం నుంచి టాక్సీలు నడుపవచ్చని తెలిపారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా కర్ణాటకలో ఇప్పటివరకు దాదాపు 1231 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.