Begin typing your search above and press return to search.

పాత ఫోటోతో సీఎంకు పంచ్ ఇచ్చిన క‌మ‌ల‌నాథులు!

By:  Tupaki Desk   |   12 Jun 2019 4:48 AM GMT
పాత ఫోటోతో సీఎంకు పంచ్ ఇచ్చిన క‌మ‌ల‌నాథులు!
X
బీజేపీ తెలివే తెలివి. పాత ఫోటోల‌తో కొత్త‌గా ఇరుకున ప‌డేసిన తీరు ఇప్పుడు రాజ‌కీయంగా హాట్ టాపిక్ గా మారింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వ‌చ్చిన సీట్ల‌తో బ‌లాన్ని పెంచుకున్న బీజేపీ.. క‌ర్ణాట‌క అధికార‌ప‌క్షానికి కొత్త త‌ర‌హా స‌వాల్ విసురుతోంది.

బెంగ‌ళూరు సిటీలో సామాన్య ప్ర‌జ‌ల వ‌ద్ద వంద‌ల కోట్లు సేక‌రించి.. ఉడాయించిన ప్ర‌ముఖ జ్యువెల‌రీ సంస్థ అధినేత ఐఎంఏ సంస్థ య‌జ‌మాని మ‌న్సూర్ తో క‌లిసి క‌ర్ణాట‌క సీఎం కుమార‌స్వామి భోజ‌నం చేస్తున్న ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీనికి క్యాప్ష‌న్ గా.. నేను తింటున్నాను.. నువ్వు తిను అంటూ వ్యంగ్య వ్యాఖ్య‌ను జోడించారు. మ‌న్సుర్ లాంటి మోస‌గాడు ఇక్క‌డ ప్ర‌జ‌ల్ని మోస‌గించి ప‌రార‌య్యాడంటూ ట్వీట్ చేశారు. రాజ‌కీయంగా కొత్త అల‌జ‌డిని సృష్టించేందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ వేస్తుంద‌ని జేడీయూ మండిప‌డుతోంది.

ఎందుకంటే.. తాజాగా పోస్ట్ చేసిన ఫోటో చాలా పాత‌ద‌ని.. ఇలాంటివి పోస్ట్ చేసి ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న బీజేపీపై సీఎం కుమార‌స్వామి ఫైర్ అయ్యారు. పాత ఫోటోల‌తో రాజ‌కీయం చేయ‌టం మంచిది కాద‌ని.. ఇలాంటివి చేయ‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నారు. పాత ఫోటోల్ని తెర మీద‌కు తెచ్చి ల‌బ్థి పొందాల‌ని చూస్తున్న బీజేపీ తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.