Begin typing your search above and press return to search.

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు రూ. 25 వేల జరిమానా !

By:  Tupaki Desk   |   7 Jan 2021 6:00 AM IST
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు రూ. 25 వేల జరిమానా !
X
కర్ణాటక సీఎం యడియూరప్పకు రాష్ట్ర హైకోర్టు రూ. 25 వేల జరిమానా విధించింది. ఓ కేసులో దర్యాప్తు కొనసాగకుండా అర్జీ వేసినందుకు గాను కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బెంగళూరు సమీపంలోని గంగేనహళ్లిలో 1.11 ఎకరాల భూమి డీనోటిఫికేషన్ ద్వారా యడియూరప్ప లబ్ధి పొందారన్న ఆరోపణలపై 2015లో కేసు నమోదైంది.

కలబురగి హైకోర్టు సంచార బెంచ్‌ లో సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమఠ ఈ పిల్ దాఖలు చేశారు. డీనోటిఫికేషన్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బంధువులకు కూడా మేలు జరిగిందని ఆయన ఆరోపించారు. తాజాగా, ఈ కేసు విచారణ సందర్భంగా దర్యాప్తును కొనసాగించాలని లోకాయుక్తను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు కొనసాగకుండా అర్జీ వేసిన యడియూరప్పకు న్యాయమూర్తి జస్టిస్ మేకేల్ డి కున్హా రూ. 25 వేల జరిమానా విధించారు. కాగా, యడియూరప్పపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేసేందుకు కోర్టు గతంలోనే నిరాకరించింది.