Begin typing your search above and press return to search.

కన్నడ బీజేపీలో.. రాజకీయ అసమ్మతి

By:  Tupaki Desk   |   30 May 2020 6:50 AM GMT
కన్నడ బీజేపీలో.. రాజకీయ అసమ్మతి
X

కర్ణాటక పాలిటిక్స్ ఎప్పుడూ కుమ్ములాటలు.. పదవుల కోసం కొట్లాటలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఇప్పటికే కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వానికి తాజాగా ఆ పార్టీలో రేగిన అసమ్మతి ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రస్తుతం లాక్ డౌన్ మహమ్మారి విస్తరిస్తున్న వేళ దేశమంతా రాజకీయ స్తబ్దత నెలకొంటే.. కన్నడ నాట మాత్రం రాజకీయ అసమ్మతి తారాస్థాయికి చేరడం విశేషం. బీజేపీ ప్రభుత్వానికి అది పెనుముప్పుగా మారుతోంది.

బీజేపీలో అసమ్మతి ఎమ్మెల్యేగా ముద్రవేసుకున్న ఉమేశ్ కత్తి మరోసారి తన నివాసంలో కొందరు ఎమ్మెల్యేలతో సమావేశం కావడం బీజేపీ లో కలకలం రేపింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన సీఎం యడుయూరప్ప.. ఎమ్మెల్యే ఉమేశ్ కత్తిని తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సీఎంతో భేటి అయిన అనంతరం ఉమేశ్ కత్తి మీడియాతో మాట్లాడారు.రాజకీయాలకు ఈ భేటి సంబంధం లేదన్నారు. ఈ రహస్య సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.

ఇక ఎమ్మెల్యేలంతా యడుయూరప్పకే మద్దతుగా ఉన్నారని.. ఆయన నాయకత్వంపై తమకు విశ్వాసముందని.. బీజేపీ ప్రభుత్వానికి ఢోకా లేదని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎంపీ రేణుకాచర్య తెలిపారు.