Begin typing your search above and press return to search.
స్పీకర్ ఆగ్రహం...మంత్రులు సభకు రావాల్సిందే
By: Tupaki Desk | 4 July 2018 2:03 PM GMTఅసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలి కాలంలో అనూహ్య పరిణామాలతో తెరమీదకు వచ్చిన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో చిత్రమైన పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు రాకపోవడంపై కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశాలను తేలిగ్గా తీసుకుంటే బాగుండదు అని హెచ్చరించారు. 15 నిమిషాలు టైమ్ ఇస్తున్నా.. దీనిని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. వాళ్లు అసెంబ్లీని తేలిగ్గా తీసుకోకూడదు అని స్పీకర్ స్పష్టంచేశారు.
గవర్నర్ కు ధన్యవాద తీర్మానం సమయంలో మొత్తం 13 మంది మంత్రులు సభకు రావాల్సి ఉండగా.. కేవలం ఆరుగురు మాత్రమే వచ్చారు. దీనిపై స్పీకర్ రమేష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ ను - సభాధ్యక్ష స్థానాన్ని పట్టించుకోకపోతే బాగుండదని తీవ్ర స్వరంతో అన్నారు. కేవలం ఆరుగురే వచ్చారు.. మిగతా వాళ్లు ఎక్కడికెళ్లారు అని ఆయన ప్రశ్నించారు. సభకు రాని వాళ్ల పేర్లను చెబుతూ.. పీడబ్ల్యూడీ మంత్రి రేవణ్న - సాగునీటి మంత్రి డీకే శివకుమార్ - స్థానిక సంస్థల శాఖ మంత్రి రమేష్ జర్కిహోలి - పశుసంవర్ధక శాఖ మంత్రి వెంకటరావు - హౌజింగ్ మంత్రి యూటీ ఖాదర్ - టూరిజం మంత్రి మహేష్ - పౌరసరఫరాల మంత్రి జమీర్ అహ్మద్ ఎక్కడ అంటూ స్పీకర్ ప్రశ్నించారు. మీ వాళ్లను రమ్మని చెప్పండి.. సభ కంటే ముఖ్యమైన పని వాళ్లకు ఏముంది అంటూ డిప్యూటీ సీఎం పరమేశ్వరను స్పీకర్ అడిగారు. ఆ తర్వాత మిగతా మంత్రులు కూడా సభకు హాజరయ్యారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది