Begin typing your search above and press return to search.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి ప్రచారానికి మొహం చాటేస్తున్న సినీ తారలు!
By: Tupaki Desk | 8 April 2023 12:41 PM GMTమే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అయితే సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీ వైపే అంచనాలు వెలువరించాయి. దీంతో బీజేపీ చెమటోడ్చాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో సినిమా తారలపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే బీజేపీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ముందు బీజేపీకి ప్రచారం చేయడానికి సిద్ధంగానే కనిపించిన కన్నడ సినీ నటులు ఎన్నికల వేళ ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చేటట్టు కనిపిస్తున్నారు.
కన్నడ నటులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలను బీజేపీ గత కొంతకాలంగా చేస్తోంది. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోడీ బెంగళూరు వచ్చినప్పుడు రాజ్ భవన్ లో గవర్నర్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేజీఎఫ్ స్టార్ యష్, కాంతార దర్శకుడు కమ్ హీరో అయిన రిషబ్ శెట్టి, నటుడు కమ్ దర్శకుడు దర్శన్ తదితరులు హాజరయ్యారు. వీరందరిని ఆప్యాయంగా పలకరించిన ప్రధాని మోడీ వారితో ఫొటోలు కూడా దిగారు. దీంతో ఆ నటులంతా బీజేపీకి ప్రచారం చేయనున్నారని చెప్పుకున్నారు.
మరోవైపు మాండ్య ఇండిపెండెంట్ ఎంపీగా ఉన్న ప్రముఖ నటీమణి, రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈ మేరకు సుమలత కొద్ది రోజుల క్రితం తన కుమారుడుతో కలిసి ప్రధాని మోడీని కలిశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాండ్య నుంచి బీజేపీ అభ్యర్థిగా సుమలత పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది.
అయితే కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఉదంతంతో కన్నడ నటులు ఆయా పార్టీలకు ప్రచారం చేయడానికి వణుకుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని తెలిపారు. అయితే ఆ పార్టీ తరఫున పోటీ చేయనన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం చేస్తానన్న సుదీప్ సినిమాలను, ఇతర టీవీ కార్యక్రమాలను ఎన్నికలయ్యే వరకు ఆపేయాలని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాయి.
ఇప్పుడు సుదీప్ కోవలో రిషబ్ శెట్టి, యష్, దర్శన్ తదితరులు బీజేపీకి ప్రచారం చేస్తే ఎన్నికలయ్యే వరకు వారి సినిమాలు, ఇతర టీవీ, ఓటీటీ కార్యక్రమాలను ఆపు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జేడీఎస్, కాంగ్రెస్ లేఖ రాసే ప్రమాదం ఉంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే ఎన్నికలయ్యే వరకు ఈ నటుల సినిమాలు, ఓటీటీ ప్రోగ్రాములు, టీవీ కార్యక్రమాలు ఆగిపోతాయి. అప్పుడు వీరికి, వీరితో సినిమాలు తీసిన దర్శక నిర్మాతలకు భారీ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సుదీప్ ఉదంతంతో రిషబ్ శెట్టి, యష్, దర్శన్ బీజేపీకి ప్రచారం చేసే విషయంలో వెనుక ముందూ ఆడుతున్నారని అంటున్నారు. రిషబ్ శెట్టి ఇప్పటికే తనను వదిలేయాలని.. తాను సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పినట్టు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.