Begin typing your search above and press return to search.

ఏపీలో మోడీకి గుడి?

By:  Tupaki Desk   |   20 Oct 2015 10:56 AM GMT
ఏపీలో మోడీకి గుడి?
X
రాజధాని అమరావతి నిర్మాణంతో అదరగొడుతున్న చంద్రబాబును దేవుడితో పోలుస్తూ ఆ ప్రాంతంలో గుడి కడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మోడీకి కూడా గుడి కడతామంటున్నారు ప్రత్యేక హోదా సాధన సమాఖ్య నాయకుడు కారెం శివాజీ... అయితే, అందుకు ఆయన షరతు విధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే గుడి కడతామని చెబుతున్నారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సాధన సమాఖ్య నాయకుడు కారెం శివాజీ నేతృత్వంలో తాజాగా ఏలూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న మోడీ అదేసమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తూ ప్రకటన చేయాలని వారు డిమాండు చేస్తున్నారు. ఒకవేళ మోడీ కనుక ప్రత్యేక హోదా ఇస్తే ఆయన్ను దేవుడిలా కొలుస్తామని.. గుడి కట్టి పూజలు చేస్తామని శివాజీ ప్రకటించారు. మరి హోదా ఇస్తే గుడి కట్టించే శివాజీ హోదా ఇవ్వకుంటే ఏం కడతారో?

ప్రత్యేక హోదా కోసం టీడీపీ, ప్రతిపక్షాలు, సాధన సమితి వంటివన్నీ ఎవరి మార్గంలో వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వైసీపీ నేత జగన్ నిరాహార దీక్ష చేశారు. ఈ నేపథ్యంలో అమరావతి శంకుస్థాపనకు వచ్చే ప్రధాని మోడీకి విషయం చేరేలా శంకుస్థాపన ప్రాంతంలో నిరసనలు తెలిపే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కూడా ఇలాంటి ఊహించిభద్రత భారీగా పెంచింది.