Begin typing your search above and press return to search.

సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. కరాటే కళ్యాణి ఫిర్యాదుతో కేసు

By:  Tupaki Desk   |   14 April 2022 5:51 AM GMT
సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. కరాటే కళ్యాణి ఫిర్యాదుతో కేసు
X
ఎప్పుడూ వివాదాస్పద అంశాల్లో ఉంటూ.. రోజు వార్తల్లో ఉండే కరాటే కళ్యాణి మరోసారి కొత్త కేసులో ఇరుక్కుని సంచలనంగా మారారు. సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి మరోసారి ఫోకస్ అయ్యారు.

ఈమెను ఫైర్ బ్రాండ్ అని కూడా అంటుంటారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె తాజాగా పోలీస్ గడప తక్కింది. హిందూ దేవత అయిన 'సీతమ్మ తల్లి' పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శ్రీరామనవమి పర్వదినాన హిందూదేవత అయిన సీతమ్మపై శ్రీనాథ్ చౌదరి అనే వ్యక్తి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు.

ఆమె ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శ్రీనాథ్ పై సుమోటో కేసు నమోదు చేశారు. వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేశారు.

హిందువుల దేవత అయిన సీతమ్మపై అసభ్య పదజాలంతో మాట్లాడడం దారుణం అని కల్యాణి అన్నారు. అతడిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు నగర జాయింట్ సీపీ గజారావు భూపాల్ పేర్కొన్నారు.

సినీ, రాజకీయ అంశాలపై కరాటే కళ్యాణ్ స్పందిస్తుంటారు. ఇటీవల 'మా' ఎన్నికల సమయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పలు టీవీ, సినిమాల్లో పాత్రల్లో నటిస్తూనే ఇటీవల ఓ కేసు విషయంలో ఇన్ వాల్వ్ అయ్యి కేసుల్లో ఇరుకున్నారు. తాజాగా సీతమ్మను కించపరిచిన వ్యక్తిపై ఫిర్యాదు చేశారు.