Begin typing your search above and press return to search.
ఏపీలో ఎమ్మెల్యే కుమారుడికి కరోనా పాజిటివ్ !
By: Tupaki Desk | 1 Aug 2020 10:10 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహోధృతంగా విస్తరిస్తోంది. సామాన్యులనే కాదు.. ప్రజా ప్రతినిధులకూ సోకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడ్డారు. హోమ్ క్వారంటైన్‌లో కి వెళ్లిపోయారు. తాజాగా ఏపీలో మరో నాయకుడికి కరోనా పాజిటివ్ గా తేలింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వైసీపీ నాయకుడు కరణం వెంకటేష్ కరోనా బారిన పడ్డారు.
శనివారం తన ఫేస్ బుక్ పేజీలో స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం తాను కుటుంబ సమేతంగా హోం క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. మళ్లీ 15 రోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. అలాగే, కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.
కాగా , ఏపీలో గత మూడు రోజులుగా ప్రతి రోజూ కూడా 10 వేలకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,933కి చేరింది. అలాగే ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,349కి చేరింది. కొత్తగా 3,822 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ఇంకా 75,720 మంది చికిత్స పొందుతున్నారు